యాప్నగరం

తాబేలు పొట్టలో నుంచి 915 నాణేలు తీసిన వైద్యులు!

ఓ తాబేలుకు శస్త్రచికిత్స చేసి పొట్ట నుంచి వివిధ దేశాలకు చెందిన 915 నాణేలను వైద్యులు బయటకు తీశారు.

TNN 7 Mar 2017, 1:31 am
తాబేలు పొట్టలో నుంచి ఏకంగా 915 నాణేలు బయటపడ్డాయి. ఇది థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ తూర్పు ప్రాంతంలోని శ్రీరచా కన్జర్వేషన్‌ సెంటర్‌లో చోటు చేసుకుంది. శ్రీరచా కన్జర్వేషన్ సెంటర్‌లోని తాబేళ్లు ఉండే ట్యాంక్‌లో సందర్శకులు వందల సంఖ్యలో నాణేలు విసురుతుంటారు. వాటిలో కొన్నింటిని ఒమ్సిన్‌ అనే 25 ఏళ్ల సముద్రపు పచ్చతాబేలు మింగేసింది. ఎక్కువ సంఖ్యలో నాణేలను మింగడంతో బరువు పెరిగిన ఒమిన్స్ అతికష్టం మీద ఈదే పరిస్ధితికి చేరుకుంది.
Samayam Telugu 915 coins removed from stomach of sea turtle in thailand
తాబేలు పొట్టలో నుంచి 915 నాణేలు తీసిన వైద్యులు!



ఒమ్సిన్‌ అవస్ధను గుర్తించిన కన్జర్వేషన్‌ సెంటర్‌ నిర్వాహకులు వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షించిన వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి తాబేలు పొట్టలోని నాణేలు బయటకు తీయకపోతే దాని ప్రాణాలకు ప్రమాదమని తెలిపారు. దీంతో బ్యాంకాక్‌లోని చులలాంగ్‌కోర్న్ యూనివర్సిటికి చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌కు చెందిన వైద్యులు ఒమ్సిన్‌కి ఆపరేషన్‌ నిర్వహించి దాని పొట్టలో చుట్టబడిపోయిన 5 కేజీల నాణేల బాల్‌‌ను బయటకు తీశారు. వైద్యులు దాదాపు ఏడు గంటలపాటు శ్రమించి తాబేలును రక్షించారు.


ఇలాంటి శస్త్రచికిత్సను నిర్వహించడం ప్రపంచంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. ఒమ్సిన్‌ పూర్తిగా కోలుకోవడానికి ఒక నెల సమయం పడుతుందని బ్యాంకాక్ యూనివర్సిటికి చెందిన ప్రొఫెసర్ నాంత్రికా చౌసే చెప్పారు. ఆ తర్వాత మరో ఆరు మాసాల పాటు ఫిజికల్‌ థెరపీ అవసరమని ఆమె పేర్కొన్నారు. తాబేలు పొట్టలో నుంచి బయటకు తీసిన నాణేల్లో వివిధ దేశాలకు చెందినవి ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.