యాప్నగరం

అమ్మా, నీ ప్రేమ ముందు.. ఇదెంత!

రోజంతా ఇంటి పనుల్లో అలసిపోయిన తన తల్లికి ఆ తనయుడు ఎలా సేవ చేస్తున్నాడో చూశారా. మెట్రో కాసేపు అలా రెప్పవాల్చి నిద్రపోతున్న తన తల్లి తలకు తన చిట్టి చేతులనే తలగడగా మలిచాడు. అంతేకాదు...

TNN 19 Jun 2017, 11:11 am
రోజంతా ఇంటి పనుల్లో అలసిపోయిన తన తల్లికి ఆ తనయుడు ఎలా సేవ చేస్తున్నాడో చూశారా. మెట్రో రైలులో కాసేపు అలా రెప్పవాల్చి నిద్రపోతున్న తన తల్లి తలకు ఆ చిన్నోడు తన చిట్టి చేతులనే తలగడగా మలిచాడు. అంతేకాదు, ఆమె పర్సు, వస్తువులను సైతం మోస్తూ, కాసేపు ‘అమ్మ’ బాధ్యతలను తన భుజాన్న వేసుకున్నాడు. నైరుతి చైనాలోని సిచువాన్‌ మెట్రో రైలులో ఈ దృశ్యం కనిపించింది.
Samayam Telugu a chinese boy looking after his exhausted mother
అమ్మా, నీ ప్రేమ ముందు.. ఇదెంత!


ఆ బాలుడు తల్లిపై చూపుతోన్న ప్రేమ నెటిజన్లకు భలే నచ్చేసింది. ఈ ఫొటో చైనాలో భలే ట్రెండ్ అవుతోంది. ఈ ఫొటో తీసిన వ్యక్తి సమాచారం ప్రకారం.. మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ బాలుడు అమ్మ పక్క సీట్లోనే కూర్చొన్నాడు. అయితే, చిన్న పాపతో వచ్చిన ఓ మహిళకు తన సీటు ఇచ్చి ఇలా నించున్నాడు.

తన తల్లి నిద్రిస్తుండటం చూసి, ఆమె పర్సు, చేతిలో సంచి భుజాలకు తగిలించుకుని, సీటు పక్కన ఉన్న గాజు అద్దం ఆమె తలకు తగలకుండా తన చేతిని తలగడలా మధ్యలో ఉంచాడు. ఈ చిత్రాన్ని చైనాలో ఇప్పటికే 20వేల మంది షేర్ చేసుకున్నారు. మీకు కూడా నచ్చితే తప్పకుండా షేర్ చేసుకోండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.