యాప్నగరం

ఆ సినిమాలకు బానిసగా మారిన భర్తపై సుప్రీం‌లో పిల్!

పోర్నోగ్రఫీకి బానిసగా మారిన తన భర్త అలవాటును మాన్పించడానికి ఏం చేయాలో చెప్పమంటూ ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

TNN 16 Feb 2017, 12:12 pm
పోర్నోగ్రఫీకి బానిసగా మారిన తన భర్త అలవాటును మాన్పించడానికి ఏం చేయాలో చెప్పమంటూ ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన భర్త ఆన్‌లైన్‌లో నీలిచిత్రాలకు బానిసగా మారడంతో వైవాహిక జీవితం చిక్కుల్లో పడిందంటూ ముంబైకి చెందిన మహిళ సామాజిక కార్యకర్త సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేసింది. వీటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రానికి సూచించాలని పిటిషన్‌లో పేర్కొంది.
Samayam Telugu a woman from mumbai sought a ban on pornographic sites
ఆ సినిమాలకు బానిసగా మారిన భర్తపై సుప్రీం‌లో పిల్!


ఉన్నత విద్యావంతుడైన తన భర్త వీటికి బానిసగా మారడాని, ఇవి యువతకు మరింత ప్రమాదకరంగా పరిణమించాయని ఆమె వాపోయింది. దీనికి బానిసగా మారిన తన భర్త విలువైన సమయాన్ని ఆన్‌లైన్‌లో వాటి కోసమే వెచ్చిస్తున్నాడు. భర్త నీలిచిత్రాలకు అలవాటు పడటంతో 2015 నుంచి సమస్యలు మొదలయ్యాయని తెలిపింది. తమ 30 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని వివరించింది.

ఆయన ప్రవర్తతో తనతోపాటు ఇద్దరు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని, పోర్నోగ్రఫీ ప్రభావంతో వైవాహిక జీవితంలో ఒడిదొడుకులకు తన జీవితమే ప్రత్యక్ష సాక్ష్యమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వీటికి బానిసగా మారితే భారతదేశంలో కుటుంబ విలువలకు అపారమైన నష్టం కలుగుతుందని ఆ మహిళ వాపోయింది. ఇవి పిల్లలు, యువతపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అలాగే వారి ఆలోచన విధానాన్ని కూడా ప్రభావితం చేస్తాయని కోర్టుకు విన్నవించింది.

తక్షణమే వీటిపై నిషేధం విధించాలని ఆమె కోర్టును కోరింది. కేంద్ర ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని తన వాదనలు వినిపించింది. గతంలోనే పిల్లల పోర్న్ సైట్స్‌పై సుప్రీంకోర్టు నిషేధం విధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.