యాప్నగరం

సబ్ రిజిస్ట్రార్ ఇంటిలో కళ్లు చెదిరే ఆస్తులు!

అవినీతి నిరోధక శాఖ ఓ సబ్ రిజిస్ట్రార్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో బయటపడిని ఆస్తులు చూసి అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి.

TNN 19 Jun 2017, 7:35 pm
అవినీతి నిరోధక శాఖ ఓ సబ్ రిజిస్ట్రార్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో బయటపడిని ఆస్తులు చూసి అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. ఈరోజు ఉదయం నుంచి గాజువాక‌ సబ్-రిజిస్ట్రార్ దొడ్డపనేని వెంకయ్యనాయుడు నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీ గోవిందం భవనంతో పాటు, తిరుపతిలోనూ ఏక కాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.
Samayam Telugu acb conducts raid on gajuwaka sub registrar unearths illegal assets worth rs 100 crores
సబ్ రిజిస్ట్రార్ ఇంటిలో కళ్లు చెదిరే ఆస్తులు!


ఇప్పటి వరకు రూ.6 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించారు. విశాఖలో 15 ఇళ్ల స్థలాలు, నర్వలో 4 ఎకరాల భూమికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. అలాగే వెంకయ్యనాయుడు నివాసంలో రెండు కార్లు, బైక్‌ను సీజ్ చేశారు. అంతే కాకుండా 1.75 కిలోల బంగారం,1.35 కిలోల వెండి, రూ.20 లక్షల విలువైన వస్తువులు, రూ.42 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలో మరో రూ.5 లక్షలతోపాటు రూ. 5 లక్షల విలువైన పత్రాలు ఉన్నట్టు గుర్తించారు. విశాఖలోని మహారాణిపేటలో రూ.50 లక్షల విలువ చేసే భవనం కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

విశాఖలోని కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో ఆయన పేరిట లాకర్, వెంకయ్యనాయుడు మామ పేరుతో తిరుపతిలో ఐదు అంతస్తుల లాడ్జి, తోడల్లుడు పేరుతో తుంగ్లాంలో ఓ భవనం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. విశాఖలో 6 చోట్ల, తిరుపతిలో 3 చోట్ల అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. గతంలోనూ వెంకయ్యనాయుడు ఏసీబీ కేసులో అరెస్టయ్యాడు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న సమయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించి అక్రమాస్తుల కేసులో ఆయన్ని అరెస్టు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.