యాప్నగరం

బరువు పెరిగారన్న కారణంతో ఉద్యోగులకు డిమోషన్!!

తమ సంస్ధలోని బరువు పెరిగిన కొంత మంది ఉద్యోగులకు డిమోషన్ ఇచ్చి వేరే విభాగానికి బదిలీ చేసింది.

TNN 20 Jan 2017, 10:01 am
తమ సంస్ధలోని బరువు పెరిగిన కొంత మంది ఉద్యోగులను విమానయాన సంస్ధ ఎయిర్ ఇండియా గ్రౌండ్‌ డ్యూటీ విభాగానికి బదిలీ చేసింది. క్యాబిన్ క్రూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 57 మంది ఉద్యోగులు అధిక బరువు ఉన్నట్లు ఎయిర్ ఇండియా గత నెలలోనే గుర్తించింది. త్వరగా బరువు తగ్గకపోతే శాశ్వతంగా గ్రౌండ్ డ్యూటీ ఉద్యోగులుగా ఉండిపోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది.
Samayam Telugu air india grounds members because they overweight
బరువు పెరిగారన్న కారణంతో ఉద్యోగులకు డిమోషన్!!


తాము విధించిన గడువులోగా బరువు తగ్గని వారిని గ్రౌండ్ డ్యూటీ విభాగానికి బదిలీ చేసినట్లు ఎయిర్ ఇండియా‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం అధిక బరువు కలిగినవారిని గుర్తించామని అన్నారు. అధిక బరువున్నవారిలో చాలా మంది ఎయిర్‌హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విభాగంలో విధులు నిర్వహించడమంటే నెలకు సుమారు రూ.35 వేల నుంచి రూ.50 వేల అలవెన్సును కోల్పోయినట్లే. అధిక బరువు కలిగిన వారిని క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు ఆరు నెలల పాటు అనర్హులుగా పరిగణిస్తారు. తిరిగి ఏడాదిన్నరలో సాధారణ స్థాయికి రాకపోతే శాశ్వతంగానే క్యాబిన్ క్రూ పోస్టులకు అనర్హులగా ప్రకటిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.