యాప్నగరం

నోట్లరద్దు: ఆ ఆసుపత్రిలో సేవలు ఉచితం

పాత నోట్లు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని పాటించకుండా పేషెంట్లకు చుక్కలు చూపిస్తున్న ఆసుపత్రులకు భిన్నంగా ఆదర్శవంతమైన నిర్ణయాన్ని తీసుకుందో ప్రైవేట్ ఆసుపత్రి.

TNN 12 Nov 2016, 10:48 am
నరేంద్రమోడీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని అనారోగ్య పీడితులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిపై ప్రభావం ఎక్కువగా పడిన సంగతి తెలిసిందే. పాత నోట్లను ఆసుపత్రుల్లో స్వీకరించాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా కూడా దాదాపు ఏ ఆసుపత్రీ దాన్ని పాటించడంలేదు. ఆసుపత్రులన్నీ పాత నోట్లను తీసుకోవడానికి నిరాకరించడంతో పేషెంట్లు, వారి బంధువులు పడుతున్న బాధలు ఇన్నీ అన్నీ కావు. కానీ, రాంచీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి మాత్రం మిగిలిన ఆసుపత్రులను ఆదర్శంగా నిలుస్తోంది. మోడీ నిర్ణయం అమల్లోకి వచ్చిన తరువాత పేషెంట్లు పడుతున్న ఇక్కట్లను గమనించి తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ నెల 13వ తేదీ వరకు ఆసుపత్రిలో సేవలన్నీ ఉచితమేనని ప్రకటించడంతో వైద్యం కోసం రోగులు అక్కడ బారులు తీరారు. వారందరికీ ఆసుపత్రి వైద్యులు ఓపికగా సేవలందిస్తున్న తీరు అందరి మన్ననలు పొందుతోంది. మిగిలిన ఆసుపత్రులు కూడా అంతటి ఉదారంగా ఉచితంగా సేవలందించాలని ఎవరూ కోరకపోయినప్పటికీ.. కనీసం ప్రభుత్వం సూచించిన మాదిరిగా రూ.500, రూ.1000 నోట్లను స్వీకరించి వైద్యం చేస్తే చాలని ప్రజలు కోరుతున్నారు.
Samayam Telugu 1000 notes a ranchi hospital offers free treatment for
నోట్లరద్దు: ఆ ఆసుపత్రిలో సేవలు ఉచితం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.