యాప్నగరం

మోదీజీ... తూ జియో హజారోం సాల్

బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

TNN 17 Sep 2016, 4:16 pm
అందమైన భాషలో, అంతకంటే అందంగా తన భావాలను వ్యక్తీకరించే హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. శనివారం మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మనసుకు హత్తుకునేలా తన భావాలను వ్యక్తీకరించారు. ఆ లేఖలోని సారాంశం మీకోసం..
Samayam Telugu amitabh bachchan wishes pm modi on his birthday
మోదీజీ... తూ జియో హజారోం సాల్


మన తొలి పరిచయం నేటికీ
నాలో నిత్య నూతనమే
పా మూవీ గురించి మిమ్మల్ని కలవటం..
అతిసాధారణమైన మీ ఇల్లు
నిరాడంబరమైన మీ జీవనం
ప్రేమను పంచిన ఆ భోజనం
అత్మీయపూరిత పలకరింపు

తిరిగి వచ్చేశాక, మరింత ఆశ్చర్యం
గుజరాత్ కు టూరిజం రాయబారిగా ఉండమన్న మీ పిలుపు
ఆ వెంటనే టూరిజం అధికారి రాక
ఆ పైన అతి వేగంగా పనులు షురూ

నాటి నుంచి నేటి వరకూ
మీలో అదే ఆత్మీయత
గుజరాత్ కు నాడు మీరు సీఎం
నేనో నటుడిని, ప్రభుత్వ మిషన్ లో రాయబారిని
అయితేనేం...
నిరంతరం మీ ఆత్మీయత నన్ను వెన్నంటే ఉండేది.
అమిత్ జీ ..ఎండ ఎక్కువగా ఉంది జాగ్రత్త...
ఆరోగ్యం ఎలా ఉంది...నీరు బాగా తీసుకోండి
ఏ అవసరం వచ్చినా, నాకే ఫోన్ చేయండన్న
మీ ప్రేమ..నేటికీ మరపురాదు

గుజరాత్ కు ఎప్పుడు
ఏ పనిమీద ఎక్కడకు వచ్చినా
మొదటి పలకరింపు మీదే
తొలి ఆత్మీయపూరితమైన పలకరింపు మీదే
ఆ తరువాత మీరు బిజీ
రాజకీయాలు, ఎన్నికలు
దేశ ప్రధాని కావటం

అయినా మరీ ఆశ్చర్యం

మీరు ఓ దేశానికి ప్రధాన మంత్రి...నిత్యం తీరికలేని పనుల్లో బిజీ
అయితేనేం....మీరో గొప్ప మానవతావాది, గొప్ప ఆత్మీయ నేస్తం
అన్నిటికంటే ఆశ్చర్యం...
ఎక్కడో పెళ్లిలోనో, పార్టీలోనో నేను కనిపిస్తే
అరే...గాలిపటం ఎగరేస్తుంటే మీ వేలు తెగిందట..
అమిత్ జీ ఇప్పుడెలా ఉంది...అనే మీ పలకరింపు

స్వచ్ఛ భారత్ అభియాన్
బేటీ బచావో, కిసానోం కీ సురక్షా
పానీ బచావో, శౌచాలయ్ అభియాన్
ఒకటా రెండా..నిరంతరం
మీలో దేశం దాని ప్రగతి గురించే చింత
ఇదంతా ఓ మనిషికి ఎలా సాధ్యమని నాలో ఆశ్చర్యం

మోదీ జీ
ఈ ఆశ్చర్యం నాలోనే కాదు
దేశమంతా ఉంది
అందరిలో ఆ ఆశ్ఛర్యం ఇలాగే ఉండాలని
భగవంతుడు మీకు దీర్ఘాయువు ప్రసాదించాలని
ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నా
మీకు నా తరపున, నాకుటుంబం తరపున
అభిమానులు, దేశ ప్రజల తరపున
పుట్టినరోజు శుభాకాంక్షలు

స్నేహాభిమానాలతో
అమితాబ్ బచ్చన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.