యాప్నగరం

ప్రేమికులుగా మారిన అక్కాచెల్లెళ్లు.. ఇంట్లోంచి పారిపోయి సహజీవనం!

భారతదేశం ఏమాత్రం అంగీకరించని ఆధునిక పోకడ.. ఈ ‘లెస్బియన్‌’ కల్చర్‌కు బెంగళూరు నగరం వేదికైంది..

TNN 5 Jul 2017, 9:08 pm
వరసకు అక్కా చెల్లెళ్లైన వాళ్లిద్దరూ వావీవరసలు మరిచారు. ప్రేమ పేరుతో దగ్గరయ్యారు. పెద్దవాళ్లు అంగీకరించరని ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇదెక్కడి ఘోరమంటూ.. వాళ్ల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారతదేశం ఏమాత్రం అంగీకరించని ఆధునిక పోకడ.. ఈ ‘లెస్బియన్‌’ కల్చర్‌కు బెంగళూరు నగరం వేదికైంది. చిన్ననాటి నుంచి పక్క పక్క ఇళ్లల్లోనే కలిసి పెరిగిన ఇద్దరు అమ్మాయిలు వరసకు అక్కా చెల్లెళ్లు అవుతారు. వీళ్లలో ఒకరు బీ.కాం. చదువుతుండగా, మరొక యువతి కాల్‌సెంటర్‌లో ఉద్యోగినిగా పని చేస్తోంది.
Samayam Telugu bangalore sisters turns into lesbians
ప్రేమికులుగా మారిన అక్కాచెల్లెళ్లు.. ఇంట్లోంచి పారిపోయి సహజీవనం!


రెండేళ్ల నుంచి వీళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది. బీకాం విద్యార్థిని అబ్బాయిలా ప్రవర్తిస్తూ.. మరో యువతిని ప్రేమిస్తున్నట్లుగా ప్రవర్తించింది. కాల్‌సెంటర్‌ ఉద్యోగిని మొదట ఆమె ‍ప్రవర్తనను చూసి తమాషాగా భావించినా.. కొంత కాలానికి ఆమె చేష్టలకు ఆకర్షితురాలై తన మనసు మార్చుకుంది. నాటి నుంచి వాళ్లిద్దరూ ప్రేమికుల్లా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. సాధారణ ప్రేమికుల మాదిరిగానే షాపింగ్‌లు, సినిమాలు, షికార్లకు తిరగడం, గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం చేస్తున్నారు.

వాళ్ల ప్రేమను ఇళ్లలో అంగీకరించరని భావించి, మే నెలలో ఇంట్లో నుంచి పారిపోయి గుళ్లో పెళ్లి చేసుకున్నారు. అదే నగరంలోని మరో ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. వాళ్ల ఆచూకీ కోసం తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకొని ఆ పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారు.

వారిద్దరూ మేజర్లని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్న కారణంగా తామేమీ చేయలేమని పోలీసులు తేల్చి చెప్పారు. భారత్‌లో స్వలింగ సంపర్కాన్ని అంగీకరించరు. అయితే బాధితులు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదవుతుంది.

మరోవైపు విడదీస్తారేమో అనే భయంతో ఆ జంట.. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను, లాయర్లను కలసి న్యాయం చేయాలని కోరుతోంది. నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలోని వనితా సహాయవాణిలో సదరు యువతులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.