యాప్నగరం

భార్యాభర్తల తగాదాలకు బాత్‌రూంలే కారణం!

దేశంలో బాత్‌రూంల కారణంగానే 70 శాతం మంది భార్యభర్తలు గొడవలు పడుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

TNN 1 Aug 2017, 4:18 pm
దేశంలో బాత్‌రూంల కారణంగానే 70 శాతం మంది భార్యభర్తలు గొడవలు పడుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఏటా 70 లక్షల మంది తమ మొబైల్ ఫోన్స్‌ను బాత్‌రూంలలోనే కోల్పోతున్నారట. మనం ఏడాదిలో 2500 సార్లు టాయిలెట్లకు వెళ్తామట. మొత్తం జీవితకాలంలో మూడు సంవత్సరాల కాలాన్ని టాయిలెట్లలోనే గుడుపుతామని నిపుణులు చెబుతున్నారు. వీటా ఫ్రెష్, ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఛేంజింగ్ ఫేస్ టు బాత్‌రూమ్స్’ పేరుతో నాలెడ్జ్ షేరింగ్ సెమినార్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సెమినార్‌లో వక్తలు బాత్‌రూంల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.
Samayam Telugu bathroom is the reason for argument of 70 percent couples
భార్యాభర్తల తగాదాలకు బాత్‌రూంలే కారణం!


డ్రాయింగ్ రూమ్స్ కంటే బాత్‌రూంలకే ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని వక్తలు చెప్పారు. చాలా మంది బాత్‌రూంలలోనే స్వయం స్ఫూర్తి పొందుతారని, ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకోవడానికి కూడా ఇదే మంచి ప్రదేశమని వివరించారు. మనిషి జీవితంలో బాత్‌రూంలు పోషిస్తున్న పాత్ర.. ప్రజల ఒత్తిడిని, మాసిక ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి వక్తలు సుమారు 90 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రస్తుతం చాలా బాత్‌రూమ్‌లను అందంగా తీర్చుదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్, వెనెరియోలాజిస్ట్స్, లెప్రోలజిస్ట్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డీజీపీ శాస్త్రి, ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ క్రిష్ణ పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.