యాప్నగరం

నోట్ల కట్టలపై వరలక్ష్మీ వ్రతం.. నోరెళ్లబెడుతున్న జనం!

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా నోట్ల కట్టలు, బంగారంపైనే వ్రతం చేసేశాడు. దీని కోసం..

TNN 8 Aug 2017, 8:14 pm
వరలక్ష్మీ వ్రతం చేస్తే.. మనలో చాలా మంది అరటిపండ్లు, తమలపాకులతో చేస్తారు. కానీ, బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా నోట్ల కట్టలు, బంగారంపైనే వ్రతం చేసేశాడు. దీని కోసం 100, 500, 2000 రూపాయల డినామినేషన్‌తో కూడిన రూ. 73 లక్షల కరెన్సీని ఉపయోగించాడు. కర్ణాటకలో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. బెంగళూరుకు చెందిన సూర్యనారాయణ అలియాస్ సూరి గత పదేళ్లుగా బంగారం, కరెన్సీ కట్టలతో వరమహాలక్ష్మి పూజ చేస్తున్నాడు. తాజాగా గత శుక్రవారం (ఆగస్టు 4) ఇతడు చేసిన పూజను బంధువుల్లో ఒకరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
Samayam Telugu bengalore mans vara mahalakshmi pooja on currency notes and gold goes viral
నోట్ల కట్టలపై వరలక్ష్మీ వ్రతం.. నోరెళ్లబెడుతున్న జనం!


విషయం తెలియగానే కన్నడ న్యూస్ ఛానెళ్లన్నీ సూరి ఇంటి చుట్టుముట్టాయి. ‘ఏటా కరెన్సీ కట్టలతోనే వరలక్ష్మి వ్రతం చేస్తాం. పర్వదినానికి ఒకట్రెండు రోజుల ముందు కుంటుంబసభ్యుల అకౌంట్లన్నింటి నుంచి నగదు విత్ ‌డ్రా చేస్తాం. అదంతా చట్టబద్దమైన డబ్బే. కావాలంటే వాటికి సంబంధించిన పత్రాలు కూడా సరిచూసుకోవచ్చు’ అని అతడు పేర్కొన్నాడు.

బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీలో లైసెన్స్‌డ్ బ్రోకర్‌గా పని చేస్తున్న సూరి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ద్వారాను బాగానే సంపాదించాడు. అమ్మ ఆశీర్వాదం వల్లే అదంతా సాధ్యమైందని అతడు ఆనందంగా చెబుతున్నాడు.
Read this in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.