యాప్నగరం

సన్నీలియోన్‌ను ఆదర్శంగా తీసుకోమన్న కీచక గురువు!

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే వంకర బుద్ధితో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఇప్పుడు ఊచలు లెక్కబెడతున్నాడు.

TNN 4 Feb 2017, 2:46 pm
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే వంకర బుద్ధితో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఇప్పుడు ఊచలు లెక్కబెడతున్నాడు. పిల్లలకు మాయ‌మాట‌లు చెప్పి వారిని లొంగ‌దీసుకోవాల‌ని చూసిన ప్రిన్సిపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘ‌టన బెంగళూరులోని సదాశివనగర్ కేంద్రీయ విద్యాలయలో చోటుచేసుకుంది.
Samayam Telugu bengaluru kv principal held for sexually abusing girl students
సన్నీలియోన్‌ను ఆదర్శంగా తీసుకోమన్న కీచక గురువు!


సదాశివనగర్‌లోని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ కుమార్ ఠాకూర్ విద్యార్థినుల‌పై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అక్కడ ఉపాధ్యాయులు గత నెల 14 న హెల్పలైన్ సెంటర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించారు. ఈయన గారు చెబుతున్న పాఠాల వింటే ఆడ‌పిల్ల‌ల‌ను త‌ల్లిదండ్రులు పాఠ‌శాల‌కు పంపడానికే భ‌య‌ప‌డ‌తారు. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కూడా కీచకుడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయ‌డంతో మొత్తం బండారం బయటపడింది.

కేంద్రీయ విద్యాలయలో చదువుకునే అనాథ బాలికల వివరాలను సేకరించి, వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. వీడి చేష్టలను కళ్లారా చూసిన సహచరులు ఏమీ చేయలేక సహాయ వాణికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు నగర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

ఏడుగురు బాధిత విద్యార్థినులను గుర్తించిన పోలీసులు ఠాకూర్ అకృత్యాల‌ గురించి బయటపెట్టారు. తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకుని
జైలుకు పంపారు. ఓ బాయ్‌ ఫ్రెండ్‌ని ఉంచుకోవాల‌ని, అలాగే సన్నీ లియోన్‌ని ఆద‌ర్శంగా తీసుకోమన్నాడని బాధిత విద్యార్ధిని ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా సెక్స్ టాయ్స్‌ని వాడాలని, తరచూ తనను కలమని కూడా ఠాకూర్ అన్నట్లు ఆ బాలిక పేర్కొంది.

చెప్పిన‌ట్లు చేస్తే త‌న‌కు అన్ని విధాలుగా సాయం చేస్తానన్నాడని ఆమె తెలిపింది. అలాగే నేను చెప్పిన‌ట్లు విన‌క‌పోతే ఫస్ట్ క్లాస్ మార్కులు నువ్వు కోల్పోతావని బెదిరించాడ‌ని ఆ విద్యార్ధిని ఫిర్యాదులో వివరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.