యాప్నగరం

ఆ డిప్యూటీ సీఎంకు 44,000 పెళ్లి ప్రపోజల్స్

వాట్సాప్ నెంబరుకు సమస్యలు తక్కువ... పెళ్లి ప్రపోజల్స్ ఎక్కువ వచ్చినట్టు అధికారులు గుర్తించారు.

TNN 21 Oct 2016, 2:24 pm
రోడ్లు బాగోక పోతే మా వాట్సాప్ నెంబరుకు మెసేజ్ పెట్టండి అని బీహార్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రచారం చేపట్టింది. అయితే ఆ వాట్సాప్ నెంబరుకు సమస్యలు తక్కువ... పెళ్లి ప్రపోజల్స్ ఎక్కువ వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఇంతకీ ఆ పెళ్లి ప్రపోజల్ ఎవరికీ? ఇంకెవరు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కి. 26 ఏళ్ల ఈ బ్యాచిలర్ కు ‘నన్ను పెళ్లి చేసుకోండి’ అంటూ వేల మంది అమ్మాయిలు మేసేజ్ లు పెట్టారు. ఆ మేసేజ్ లలో తమ రంగు, హైట్, వెయిట్, కొలతలు కూడా కొంతమంది పంపించారు. మొత్తం 47000 మేసేజ్ లు వాట్సాప్ కు రాగా... అందులో 3000 మాత్రమే రోడ్లు, ఇతర సమస్యలపై ఉన్నాయి. మిగతా 44,000 కూడా అమ్మాయిలు పంపించిన పెళ్లి ప్రపోజల్సే. ఆ నెంబరు డిప్యూటీ సీఎంది అనుకుని వారలా పంపించారని అధికారులు చెబుతున్నారు.
Samayam Telugu bihar deputy cm received 44000 marriage proposals on a whatsapp
ఆ డిప్యూటీ సీఎంకు 44,000 పెళ్లి ప్రపోజల్స్


దీనిపై స్పందించిన తేజస్వి తాను అమ్మానాన్నలు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ‘థాంక్ గాడ్... నాకు పెళ్లవ్వలేదు. ఒకవేళ ఇప్పటికే అయి ఉంటే ఈ మేసేజ్ ల వల్ల నాకు చాలా సమస్య వచ్చుండేది’ అని చమత్కరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.