యాప్నగరం

బికనీర్ బాలిక రేప్ కేసు... అంతా బోగస్

బాలికపై 8 మంది టీచర్లు రేప్ కు పాల్పడినట్టు వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

TNN 28 Mar 2017, 9:18 am
బాలికపై 8 మంది టీచర్లు రేప్ కు పాల్పడినట్టు వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని బికనీర్ లో ఓ తండ్రి ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురిపై 8 మంది టీచర్లు ఏడాదిన్నరగా అత్యాచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. బాధితులకు అండగా నిలిచి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారణ చేశారు. వారి విచారణలో చాలా ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. బాలిక తండ్రి తప్పుడు కేసు పెట్టినట్టు తేలింది. అసలు ఆ బాలిక నాలుగేళ్ల క్రితమే పాఠశాలకు వెళ్లడం మానేసింది. అసలు ఆ టీచర్లెవరూ ఆమెకు పెద్దగా తెలియదని కూడా పోలీసు విచారణలో తెలిసింది.
Samayam Telugu bikaner rape case girl quit school years ago claims false
బికనీర్ బాలిక రేప్ కేసు... అంతా బోగస్


కేవలం పాఠశాలపై ఉన్న కక్ష కారణంగానే బాలిక తండ్రి తప్పుడు కేసు పెట్టినట్టు చెప్పారు పోలీసులు. పోలీసులు తమ విచారణ నివేదికను రాజస్థాన్ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి అనితా బడేల్ కు అందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు. గతంలో పాఠశాల యాజమాన్యం ఆయనపై ఓ కేసుపెట్టింది... దానికి ప్రతీకారంగానే తండ్రి ఆ స్కూలు టీచర్లపై ఆరోపణలు చేశాడని మంత్రి పేర్కొన్నారు. కాగా బాలికతో మాట్లాడడానికి పోలీసులు వెళ్లినప్పుడు... ఆమెతో మాట్లాడనివ్వలేదని, ఓ గదిలో పెట్టి తాళం వేశాడని చెప్పారు. చివరికి అతడే తాను తప్పుడు ఆరోపణలు చేసినట్టు ఒప్పుకున్నాడని తెలిపారు. టీచర్లపై పెట్టిన కేసులను తొలగించమని పోలీసులు ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేసిన బాలిక తండ్రిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.