యాప్నగరం

ఓటేయండి.. న్యాయం చేస్తా: హిజ్రా అభ్యర్థి

అవినీతిలో కూరుకుపోయిన స్త్రీ, పురుష రాజకీయ నాయకులను పక్కకు నెట్టి తనకు ఓ అవకాశం ఇవ్వాలని ఓ హిజ్రా అభ్యర్థి ఓటర్లను కోరుతోంది.

TNN 15 Feb 2017, 1:04 pm
అవినీతిలో కూరుకుపోయిన స్త్రీ, పురుష రాజకీయ నాయకులను పక్కకు నెట్టి తనకు ఓ అవకాశం ఇవ్వాలని ఓ హిజ్రా అభ్యర్థి ఓటర్లను కోరుతోంది. బృహత్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (BMC) ఎన్నికల్లో పోటీస్తున్న ఏకైక హిజ్రా అభ్యర్థి ప్రియా పాటిల్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. కుర్లాలోని బెయిల్ బజార్ ప్రాంతంలో గడగడకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
Samayam Telugu bmc elections 2017 we are better than both men and women
ఓటేయండి.. న్యాయం చేస్తా: హిజ్రా అభ్యర్థి


ఆమె పోటీ చేస్తున్న వార్డు నంబర్ 166లో గడిచిన రెండు వారాల్లో 3,500కు పైగా ఇళ్లకు వెళ్లి ఆమె ఓట్లు అడిగారు. ఆమె వెంట 15 మంది హిజ్రాలు, మరో ఐదుగురు మద్దతుదారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, ఈ 30 ఏళ్ల హిజ్రా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఆమెకు ‘నాగరిక్ అధికార్ మంచ్’, ‘కిన్నార్ మా ట్రస్ట్’ అనే రెండు సంస్థలు సపోర్ట్ చేస్తున్నాయి.

ఎన్నికల ప్రచారం ముగియనున్న ఆఖరి వారంలో మూడు ర్యాలీలు నిర్వహించాలని ప్రియా పాటిల్ యోచిస్తోంది. ఓటర్లు తనను అంగీకరిస్తారని ప్రియా చాలా నమ్మకంగా ఉన్నారు. ‘ప్రస్తుతం ఆడ, మగ అభ్యర్థులు అవీనిపరులుగా మారిపోయారు. ప్రజా జీవనాన్ని ఇబ్బందికరంగా మార్చారు. ఒక్కసారి నాకు ప్రజలు అవకాశం ఇస్తే.. నన్ను నేను నిరూపించుకుంటాను’ అని ప్రియా చెబుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.