యాప్నగరం

విధానసౌధలో వీధి కుక్క విహారం

అది చాలా పటిష్టమైన భద్రతా వలయంలో ఉన్న ప్రాంతం.

TNN 30 Dec 2016, 1:12 pm
అది చాలా పటిష్టమైన భద్రతా వలయంలో ఉన్న ప్రాంతం. అందులోకి వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి ఉండాల్సిందే. అయినా ఓ వీధి కుక్క విహారానికి పోయి, విందు చేసుకుని వచ్చింది. బెంగళూరు సెక్రటేరియట్ అయిన విధాన సౌధలోకి గేటు దగ్గర నుంచి సాయుధ దళాలు కాపలా కాస్తాయి. అలాంటిది ఓ నల్ల వీధికుక్క విధానసౌధలోకి విహారయాత్రకు వెళ్లింది. కేవలం నాయకులకే అనుమతి ఉండే మూడో ఫోర్ కి వెళ్లిపోయింది. అక్కడే సీఎం, మంత్రులు, క్యాబినెట్ మీటింగ్‌లు అయ్యే హాలు అన్నీ ఉంటాయి. అంతవరకు ఓ కుక్క వెళ్లిపోయినా దానిని ఎవరూ పట్టించుకోలేదు. అక్కడ ఎవరో వదిలేసిన బిర్యానీని తినేసి అక్కడే చక్కర్లు కొట్టింది. కాసేపు వాష్ రూమ్ తిరిగింది. అలా చాలా సేపు తిరిగి తరువాత అక్కణ్నించి వెళ్లిపోయింది. 24X7 భద్రతా ఉన్న భవన సముదాయంలోనే ఇలా వీధికుక్క చక్కర్లు కొట్టడంతో భద్రతా అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Samayam Telugu bombat biryani for street dog in state secretariat
విధానసౌధలో వీధి కుక్క విహారం



Read this story in Kannada
http://vijaykarnataka.indiatimes.com/district/bengalurucity/stray-dog-enters-vidhana-soudha/articleshow/56238390.cms

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.