యాప్నగరం

ఇండియన్ బేబీ పుట్టింది.. బ్రిటన్ సంబరపడింది!

అప్పుడే పుట్టిన ఆ భారత సంతతి బిడ్డను చూసి బ్రిటన్ సంబరపడింది. వెల్‌కం అంటూ మనసారా ఆహ్వానించింది. దేశం కాని దేశంలో.. ఆ బేబీ సాధించిన ప్రత్యేకత ఏమిటో తెలుసా...

TNN 2 Jan 2017, 6:19 pm
2017న ప్రపంచమంతా కొత్త సంవత్సర సంబరాల్లో మునిగిపోయింది. ప్రజలంతా పాత సంవత్సరానికి బై బై చెబుతూ ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఇదే సమయంలో.. అమ్మ కడుపులోని బుజ్జాయిలు కూడా భూమిపై అడుగుపెట్టారు. జనవరి 1న పుట్టిన వీళ్ల బర్త్‌డే ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే, అంతకంటే గొప్ప ప్రత్యేకత ఏమిటంటే.. 2017లో అడుగుపెట్టిన తొలి నిమిషంలోనే పుట్టడం.
Samayam Telugu britains first baby was born one minute into 2017 is an indian
ఇండియన్ బేబీ పుట్టింది.. బ్రిటన్ సంబరపడింది!


బ్రిటన్‌... అర్ధరాత్రి 12.00 గంటలకు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన ఒక్క నిమిషం వ్యవధిలోనే ఓ చిన్నారి పుట్టింది. సరిగ్గా 12.01 గంటలకు పుట్టిన ఆ బేబీ భారత సంతతికి చెందిన ‘ఎల్లినా కుమారి’. భారతీ దేవి, అశ్వీనీ కుమార్‌లకు కలిగిన ఆ చిన్నారిని.. ఇప్పుడు బ్రిటన్ ప్రజలంతా శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. బ్రిటన్‌కు చెందిన ‘మెట్రో యూకే’ పత్రికైతే ఇది ఆమెకు జీవితాంతం ప్రత్యేకంగా నిలిచిపోతుది అంటూ వార్తను ప్రచురించింది. సో.. మనం కూడా ఎల్లినా కుమారికి హ్యపీ బర్త్‌డే చెప్పేద్దామా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.