యాప్నగరం

తమిళనాడు: వ్యక్తిని తొక్కేసిన ఎద్దులు

ఎద్దులను వదిలి...వాటి వెనుక పరిగెడుతూ వాటిని లొంగదీసే ఆట జల్లికట్టు.

TNN 17 Jan 2017, 4:44 pm
ఎద్దులను వదిలి...వాటి వెనుక పరిగెడుతూ వాటిని లొంగదీసే ఆట జల్లికట్టు. ఒక్కోచోట ఈ ఆటను ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. అలాగే తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో వెల్లకుట్టై గ్రామంలో ‘ఎరుతు విడుమ్ విజా’ అని పిలుస్తారు. సంక్రాంగి సందర్భంగా అక్కడ ఎద్దులను పరిగెట్టించి ఆడిస్తారు. పొంగల్ సందర్భంగా సోమవారం ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఆటలో ఎద్దులు తొక్కేయడంతో ఓ వ్యక్తి మరణించాడు. వెప్పలంపట్టు గ్రామానికి చెందిన షణ్ముగం ఎద్దుల పరుగులు చూసేందుకు వచ్చి జనంలో నిల్చున్నాడు. నిర్వాహకులు దాదాపు వందకు పైగా ఎద్దులను వదిలాయి. అవి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి జనంపై పడ్డాయి. షణ్ముగం తప్పించుకోలేకపపోవడంతో అతడిని ఎద్దులు తొక్కుకుంటూ వెళ్లిపోయాయి. తీవ్రగాయాల పాలైన షణ్ముగాన్ని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో మరణించాడు.
Samayam Telugu bull race man dies in bull attack in tamil nadu
తమిళనాడు: వ్యక్తిని తొక్కేసిన ఎద్దులు


షణ్ముగం భార్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. తన భర్త గుడికి వెళ్తుండగా ఎద్దు ఎటాక్ చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. కాగా పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.