యాప్నగరం

నరభక్షకుడు: బాలుడి మాంసం తిని, రక్తం తాగి..

లూథియానాలో నరభక్షక బాలుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. 16 ఏళ్ల బాలుడు ఓ 9ఏళ్ల బాలుణ్ని చంపి..

TNN 21 Jan 2017, 9:30 am
లూథియానాలో నరభక్షక బాలుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. 16 ఏళ్ల బాలుడు ఓ 9ఏళ్ల బాలుణ్ని చంపి..అతడి శరీరాన్ని తినడంతో పాటు రక్తాన్ని తాగిన ఘటన ఒళ్లుగగుర్పాటుకు గురి చేస్తోంది.
Samayam Telugu cannibal in ludhiana 16 year old boy kills 9 year old boy eat his body and drinks blood
నరభక్షకుడు: బాలుడి మాంసం తిని, రక్తం తాగి..


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లూథియానాలోని దుర్గి అనే ఏరియాలో ఛండీఘర్ నుంచి వలస వచ్చిన పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కాలనీకి చెందిన 9ఏళ్ల దీపు కుమార్ అనే బాలుడు సోమవారం అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దీపు కోసం గాలింపులు చర్యలు చేపట్టారు. మంగళవారం స్థానికంగా ఓ ప్రదేశంలో ముక్కలు ముక్కలైన దీపు శరీరాన్ని, గుండెను ఓ ప్రభుత్వ స్కూలు నీళ్ల ట్యాంకులో లభించడం సంచలనం సృష్టించింది.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వలస కూలీలు నివసించే కాలనీలోనే ఉండే 16ఏళ్ల బాలుడే దీపును హత్య చేసినట్లు నిర్ధారించారు. హంత బాలుణ్ని విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

ఎనిమిదో తరగతి చదివే 16ఏళ్ల బాలుడు సోమవారం మధ్యాహ్నాం సమయంలో ఇంట్లో ఎవరూ లేని టైంలో దీపు కుమార్ కు పతంగులు ఎగుర వేద్దాం రమ్మంటూ తీసుకెళ్లాడు. నిర్ణన ప్రదేశానికి తీసుకెళ్లి..గొంతు నులిమి చంపేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో దీపును బాడీనీ ముక్కలు ముక్కలు కట్ చేశాడు. వాటిని ఓ బ్యాగులో వేసుకొని మరో ప్రాంతంలో పాతి పెట్టేందుకు బయలుదేరాడు. వెళ్తువెళ్తే దీపు గుండెను స్కూళ్లో విసిరి పారేశాడు.
‘‘ఇది నరభక్షకులకు సంబంధించిన కేసు. 16ఏళ్ల బాలుడు మనుషుల మాంసం తినాలని, రక్తం తాగాలనే కోరికతో..దీపును చంపాడు. మా విచారణలో పిల్లాడి శరీరాన్ని తినడంతో పాటు రక్తాన్ని తాగాడని ఒప్పుకున్నాడు. కొన్నిసార్లు తన శరీర అవయాలను సైతం తిన్నానని చెప్పాడు. ఇంట్లో వండుకునే కోళ్ల సైతం ఉడకబెట్టకుండానే తినేవాడని తెలిపాడు’’ అని డీసీపీ భూపిందర్ సింగ్ తెలిపారు.

బాలుణ్ణి అరెస్టు చేసిన పోలీసులు..వైద్య, మాససిక పరీక్షలకు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.