యాప్నగరం

ఆ కోపిష్టి పిల్లాడు ఇప్పుడిలా చేశాడు...

ఓ చైనా పిల్లాడు మూడేళ్ల వయసులోనే పోలీసులపై తిరగబడ్డాడు... ఆ వీడియో అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది.

TNN 24 Apr 2017, 11:21 am
ఓ చైనా పిల్లాడు మూడేళ్ల వయసులోనే పోలీసులపై తిరగబడ్డాడు... ఆ వీడియో అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. రోడ్డు పక్కన ఉన్న తన బామ్మ షాపును తీసేస్తుంటే... మూడేళ్ల వయసులోనే గట్టిగా అరుస్తూ పోలీసులపై కోపం చూపించాడు. ఇప్పుడు ఆ పిల్లాడికి అయిదేళ్లు. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ముదిరిపోయాడు. బుల్లి రౌడీలా తయారయ్యాడు. తన బామ్మ షాపు ముందు ఒక వ్యక్తి ట్రాలీ ఆటో నిలిపాడు. అక్కణ్నించి తీసేయమంటూ బుడతడు కత్తి పట్టుకుని హల్ చల్ చేశాడు. అతడిని బెదిరిస్తూ... ట్రాలీ చక్రాన్ని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. అంత చిన్న వయసులో పిల్లాడు అలా విపరీతంగా ప్రవర్తిస్తున్నా... అతని తాలూకా పెద్దలెవరూ అడ్డు చెప్పడం లేదు. ఇప్పుడు ఇలా ఉంటే... పెద్దయ్యాక ఎలా తయారవుతాడో అని కొందరు విమర్శిస్తుంటే... మరికొందరు ఆ పిల్లాడిని చూసి నవ్వి ఊరుకుంటున్నారు. ట్రాలీ వాడు ఇక పిల్లాడా అరుపుల భరించలేక ట్రాలీ తీసేసి వెళ్లిపోయాడు. ఆ వీడియో మీరూ చూడండి.
Samayam Telugu chinese boy defends grandmas stall with knife
ఆ కోపిష్టి పిల్లాడు ఇప్పుడిలా చేశాడు...


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.