యాప్నగరం

వేగంగా పరీక్ష రాయడమే ఆ విద్యార్థికి శాపమైంది..!

హిందీ పరీక్షను కేటాయించిన సమయం కంటే దాదాపు అరగంట ముందే పూర్తి చేసిన విద్యార్థి ఖాళీగా కూర్చుని

TNN 21 Mar 2017, 5:04 am
పరీక్ష వేగంగా రాయడమే ఆ విద్యార్థికి శాపమైంది.. చివరికి తీవ్ర అవమానాల నడుమ ఆసుపత్రిపాలు చేసింది. పరీక్షలో కాపీ కొట్టాడని ఇన్విజిలేటర్ అనుమానించి తనిఖీ చేయడాన్ని అవమానంగా భావించిన విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకి సూసైడ్‌కి ప్రయత్నించిన ఘటన హైదరాబాద్‌లోని చంపాపేటలో చోటుచేసుకుంది. స్థానిక సంతోష్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. క్లాస్‌లో తెలివైన విద్యార్థిగా గుర్తింపు పొందిన అతను టెన్త్ క్లాస్ పరీక్షలను విద్యాదాయిని స్కూల్లో రాస్తున్నాడు. సోమవారం హిందీ పరీక్షను కేటాయించిన సమయం కంటే దాదాపు అరగంట ముందే పూర్తి చేసి విద్యార్థి ఖాళీగా కూర్చుని ఉండటంతో ఇన్విజిలేటర్‌కి అనుమానమొచ్చి జేబులని తనిఖీ చేశారు.
Samayam Telugu class 10th student commits suicide
వేగంగా పరీక్ష రాయడమే ఆ విద్యార్థికి శాపమైంది..!


ఆ సమయంలో అక్కడ అనుమానాస్పద రీతిలో ఒక చిట్టీ కనపడటంతో విద్యార్థిని ఆఫీస్ గదికి తీసుకెళ్లి ప్రత్యేకంగా విచారించారు. అనంతరం సంబంధిత అధికారులకు, పాఠశాల నిర్వహకులకు చిట్టీ విషయమై సమాచారం అందించడంతో అవమానంగా భావించిన విద్యార్థి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తన తప్పు లేకపోయినా నిందలు వేస్తున్నారంటూ పరీక్ష కేంద్రంలోనే మనస్థాపంతో తలను గోడకేసి కొట్టుకోగా.. ఇన్విజిలేటర్ వారించడంతో మిన్నకుండిపోయాడు. అయితే కొంతసేపటికే తను బాత్రూమ్ వెళ్లాలని అనుమతి తీసుకుని గది వెలుపలకొచ్చి మూడో అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని పాఠశాల యాజమాన్యం హుటాహుటీనా ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సంగారెడ్డి ఎంఈవో తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.