యాప్నగరం

బాహుబలి సినిమా చూసిన సీఎం

కర్ణాటక సీఎం సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

TNN 2 May 2017, 12:20 pm
కర్ణాటక సీఎం సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటి వరకు విదేశీ పర్యటనలో ఉన్న సీఎం సిద్దరామయ్య సోమవారం రెండు సినిమాలు చూశారు. అందులో ఒకటి బాహుబలి పార్ట్ 2. అలాగే మరో కన్నడ సినిమా ‘నిరుత్తరా’ కూడా చూశారు. తన కొడుకు యతీంద్ర, ఇద్దరు మనవళ్లు, ఇద్దరు మంత్రులతో కలిసి ఆయన సోమవారం ఉదయం, మధ్యాహ్నం సినిమాలు చూశారు. కాగా ఇందులో చెప్పుకోవాల్సి ముఖ్యాంశం ఏంటంటే... సిద్ధరామయ్యతో పాటూ అదే హాల్ లో 48 మంది సినిమా చూశారు. సీఎంతో కలిపి వారంతా టిక్కెట్ ను రూ.1040 చెల్లించి కొన్నారు. ఆయన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో మల్టీప్లెక్సెస్ సినిమా థియేటర్లో టిక్కెట్ ధర రెండు వందల రూపాయలకు మించకూడదని చెప్పారు. ఆయనే ఇప్పుడు వెయ్యి రూపాయలకు మించి ఖర్చుపెట్టి టిక్కెట్ కొనడం విమర్శలకు దారి తీస్తోంది.
Samayam Telugu cm siddaramaiah watches baahubali2
బాహుబలి సినిమా చూసిన సీఎం


Read it in Kannada:

http://vijaykarnataka.indiatimes.com/state/karnataka/siddaramayya-watch-bahuballi-niruttara-film/articleshow/58464835.cms

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.