యాప్నగరం

పక్కసీట్లో అమ్మాయి.. వ్యక్తి అసభ్య ప్రవర్తన!

బస్సు కదలగానే ఆమె భూజాలను తాకుతూ.. ఫ్యాంట్ జిప్ తీసి, ఆమె ఎదుటే హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు.

TNN 12 Feb 2018, 6:44 pm
ఢిల్లీలో అమ్మాయిలకు పట్టపగలే రక్షణ లేదని చెప్పే మరో ఘటన ఇది. దాదాపు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఓ వ్యక్తి.. ఓ అమ్మాయి పక్క సీట్లో కూర్చొని అత్యంత జుగుప్సకరంగా ప్రవర్తించాడు. అతడి చర్యలు చూసి షాకైన ఆ అమ్మాయి.. గట్టిగా అరచి అలా చేయొద్దని చెప్పినా ఆ వ్యక్తి పట్టించుకోలేదు. కనీసం తోటి ప్రయాణికులు కూడా అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. దీంతో, ఆమె అతడు చేస్తున్న పనిని వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Samayam Telugu college girl posts video of a man masturbating next to her on a delhi bus
పక్కసీట్లో అమ్మాయి.. వ్యక్తి అసభ్య ప్రవర్తన!


ఫిబ్రవరి 7న వసంత గ్రామం నుంచి ఐఐటీ గేట్‌కు బస్సులో వెళ్తున్న ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని పక్కన ఓ మధ్య వయస్సు వ్యక్తి కూర్చున్నాడు. బస్సు కదలగానే ఆమె భూజాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. కొద్దిసేపటి తర్వాత జిప్ తీసి, ఆమె ఎదుటే హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం తోటి ప్రయాణికులకు చెప్పినా, ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆ వీడియోను పోలీసులకు అప్పగించి నిందితుడికి తగిన బుద్ధి చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.