యాప్నగరం

కొన్న షర్టు రంగు మారిందని... రచ్చరచ్చ

కేరళలోని కొట్టాయంలో ఓ షాపుకి నిరసనగా విద్యార్థులు ధర్నా చేపట్టారు.

TNN 17 Feb 2017, 6:30 pm
కేరళలోని కొట్టాయంలో ఓ షాపుకి నిరసనగా విద్యార్థులు ధర్నా చేపట్టారు. మార్ బెసెల్లియస్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి కొట్టాయంలో ఉన్న కళ్యాణ్ సిల్క్స్ షాపుకు వెళ్లి ఒక షర్టు కొన్నాడు. అది కూడా ఒకటి కొంటే ఒకటి ఉచితం ఆఫర్లో. షర్టు వేసుకున్నాక ఉతికాడు. అంతే షర్టు రంగు ఊడిపోవడం ప్రారంభించింది. ఆ రంగు విద్యార్థి శరీరానికి కూడా అంటుతుండడంతో షర్టు పట్టుకుని కళ్యాణ్ సిల్క్స్ షాపుకు వెళ్లాడు. సేల్స్‌మేన్ తో వాగ్వాదం జరిగింది. ఆ తరువాత అసలేం జరిగిందో కానీ... విద్యార్థి షాపు నుంచి బయటికి వచ్చి చాలా రాధ్దాంతం చేశాడు. తనని సేల్స్ మేన్ కొట్టాడని, షర్టు రంగు పోతున్న విషయాన్ని బయటికి పొక్కకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. తన స్నేహితులను, బంధువులను అక్కడికి పిలిచాడు. పోలీసు కంప్లయింట్ ఇచ్చాడు. కాలేజీ విద్యార్థులంతా అక్కడికి చేరుకున్నారు. ధర్నా నిర్వహించారు. చివరికి వారి గోల భరించలేక షాపు నిర్వాహకులు లక్ష రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. తమ షాపుపైనా, సేల్స్ మెన్ల పైనా పెట్టిన ఫిర్యాదును వెనక్కి తీసుకోమని కోరారు. అలా చిన్న షర్టు గొడవ చినికిచినికి గాలివానైంది.
Samayam Telugu college students protest against textile showroom in kottayam
కొన్న షర్టు రంగు మారిందని... రచ్చరచ్చ


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.