యాప్నగరం

పోలీస్ ట్రీట్‌మెంట్.. స్టేషన్‌లో లోదుస్తులతో డాన్స్!

ఒక అమ్మాయిని వేధించిన ముగ్గురు వ్యక్తులకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ట్రీట్‌మెంట్ వివాదాస్పదమైంది.

TNN 1 Nov 2017, 5:10 pm
ఒక అమ్మాయిని వేధించిన ముగ్గురు వ్యక్తులకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ట్రీట్‌మెంట్ వివాదాస్పదమైంది. నిందితుల బట్టలూడదీయించి లోదుస్తులతో పోలీస్ స్టేషన్‌లో డ్యాన్సులు వేయించారు ఆ సీఐ. వాళ్లకు బుద్ధి చెప్పడానికి ఆయన ఈ పనిచేసినప్పటికీ మానవ హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు సీఐ చర్యను తప్పుబడుతున్నారు. ఇంతకీ ఈ ఆసక్తికర సంఘటన కేరళలో చోటుచేసుకుంది. మళప్పురంలోని తానూర్ పోలీస్ స్టేషన్ సీఐ ఇప్పుడు వార్తల్లో నిలిచారు.
Samayam Telugu cop forces 3 accused to dance in undergarments
పోలీస్ ట్రీట్‌మెంట్.. స్టేషన్‌లో లోదుస్తులతో డాన్స్!


మళప్పురంలోని ఓ సినిమా థియేటర్ వద్ద ముగ్గురు వ్యక్తులు ఓ అమ్మాయిని వేధించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని తానూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీళ్లు చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఐ వారి చేత బలవంతంగా బట్టలు ఇప్పించారు. డ్రాయిర్లతో ‘చమ్మ చెక్క’ స్టైల్లో డాన్సులు వేయించారు. దీన్ని స్టేషన్లోనే ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయం మీడియాలో రావడంతో పోలీసు ఉన్నతాధికారులు సీఐ చర్యలు తీసుకోవడాదనికి ఉపక్రమించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.