యాప్నగరం

ఉళ్లోకి మొసలి.. జనం పరుగో పరుగు

ఉత్తర భారత దేశంలో కురిసిన భారీ వర్షాల దాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఎక్కడెక్కడి జలచరాలు ఊళ్లలోకి ప్రవేశిస్తున్నాయి.

TNN & Agencies 24 Aug 2016, 6:29 pm
ఉత్తర భారత దేశంలో కురిసిన భారీ వర్షాల దాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఎక్కడెక్కడి జలచరాలు ఊళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లా పరిస్థితిలో వరద బీబత్సం మిగిలిన ప్రాంతాల్లోకన్నా ఎక్కువని అధికారులు చెపుతున్నారు. అసలే వరద నీరు ఊళ్లలోకి ప్రవేశించి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతుంటే, పులిమీద పుట్రలా మొసళ్లు కూడా ఊళ్లలోకి వచ్చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. మిర్జాపూర్లోని ఒక గ్రామంలోకి ఇటీవల పెద్ద మొసలి ఒకటి ప్రవేశించింది. నేరుగా ఒక గ్రామస్తుడి ఇంట్లోని మంచం కిందకు వెళ్లి తిష్టవేసింది. దాన్ని చూసిన గృహస్తు, అతని కుటుంబ సభ్యులు పెద్ద పెట్టున కేకలు పెడుతూ గ్రామంలోకి పరుగుతీశారు. అప్పటికే ఆ గ్రామంలో పెద్ద పెద్ద విషసర్పాలు కూడా వచ్చి చేరాయి. గ్రామస్తులు అటవీ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి ఆ మొసలిని తమతో తీసుకెళ్లి దూరంగా వదిలేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.