యాప్నగరం

‘ఆసియా సెక్సీయెస్ట్ ఉమెన్’ గా దీపిక

బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకునే ఆసియాలోనే సెక్సీయెస్ట్ మహిళగా నిలిచింది.

TNN 8 Dec 2016, 8:25 pm
బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకునే ఆసియాలోనే సెక్సీయెస్ట్ మహిళగా నిలిచింది. నాలుగేళ్లుగా ‘ఆసియా సెక్సీయెస్ట్ మహిళ’ టైటిల్ ను ప్రియాంక చోప్రా గెలుస్తూ వస్తోంది. ఈ ఏడాది మాత్రం దీపిక ఆ టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ప్రియాంక చోప్రా రెండోస్థానంతో సరిపెట్టుకుంది. బ్రిటన్‌కి చెందిన ‘ఈస్టర్స్ ఐ’ అనే వార్తాపత్రిక ఈ పోల్‌ని నిర్వహిస్తూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే ఈ పోల్‌లో వచ్చిన ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు.
Samayam Telugu deepika padukone named sexiest asian woman
‘ఆసియా సెక్సీయెస్ట్ ఉమెన్’ గా దీపిక



ఇక మిగతా స్థానాల మాటకి వస్తే... నియా శర్మ మూడో స్థానంలో, బుల్లితెర నటి ద్రష్టి ధామి నాలుగో స్థానంలో, అలియా భట్ అయిదో స్థానంలో, మరో బుల్లి తెర నటి సనయా ఇరానీ ఆరోస్థానంలో, కత్రినా కైఫ్ ఏడో స్థానంలో, సోనమ్ కపూర్ 8వ స్థానంలో, పాక్ నటి మహీరా ఖాన్ 9వ స్థానంలో, గౌహర్ ఖాన్ పదో స్థానంలో నిలిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.