యాప్నగరం

ఢిల్లీ వీధుల్లో ఘోరం.. మహిళను నగ్నంగా ఊరేగించారు!

ఓ మహిళ పట్ల తోటి మహిళలే దారుణంగా ప్రవర్తించి, సిగ్గుతో తలదించుకునే ఘటన దేశ రాజధాని వీధుల్లో చోటుచేసుకుంది.

TNN 8 Dec 2017, 3:39 pm
ఓ మహిళ పట్ల తోటి మహిళలే దారుణంగా ప్రవర్తించి, సిగ్గుతో తలదించుకునే ఘటన దేశ రాజధాని వీధుల్లో చోటుచేసుకుంది. తాము చేస్తోన్న అక్రమ మద్యం వ్యాపారాన్ని బయటపెట్టిందని ఓ మహిళను తీవ్రంగా హింసించి, నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నరేలా ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్నారని ఢిల్లీ మహిళ కమిషన్‌కు బాధితురాలు సమాచారం అందించారు. ఆ మహిళ ఇచ్చిన సమాచారంతో గురువారం రాత్రి పోలీసులు నరేల్ ప్రాంతంలో సోదాలు నిర్వహించి, ఓ ఇంటి నుంచి 300 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నుంచి పోలీసులు వెళ్లిపోగానే తమ వ్యాపారాలపై సమాచారమిచ్చిన మహిళపై నిందితులు దాడి చేశారు.
Samayam Telugu delhi horror woman disrobed attacked by mob with iron rods in narela
ఢిల్లీ వీధుల్లో ఘోరం.. మహిళను నగ్నంగా ఊరేగించారు!


ఇనుప రాడ్లతో ఆమెను కొట్టి, దుస్తులు చించి నగ్నంగా ఊరేగించారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఘటనపై దిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బాధితురాలు వివరించిన వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. లిక్కర్‌ మాఫియాకు వ్యతిరేకంగా మాట్లాడుతావా అంటూ వారు తనను బెదిరించి, దాడిచేశారని బాధితురాలు పేర్కొంది. తనను రోడ్డు మీదకు లాక్కొచ్చి కొట్టి, దుస్తులు చించేశారని... దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ పోలీసును కూడా కొట్టారని తెలిపింది. సుమారు 25 మంది దీనిలో పాల్గొన్నట్లు స్వాతి మలివాల్ తెలిపారు. పోలీసులకు కూడా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, చోద్యం చూశారని ఆమె అన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నామని రోహిణి డిప్యూటీ కమిషనర్ పోలీస్ రజనీశ్ గుప్తా తెలిపారు.

ఈ హేయమైన ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ఘటనకు పాల్పడినవారిని, బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు. మరోవైపు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దిగ్భ్రాంతికరమైన, సిగ్గుపడాల్సిన ఘటన, లెఫ్టినెంట్ గవర్నర్ వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు భిన్నంగా స్పందించడం గమనార్హం. ఆమెపై దాడి జరిగిన మాట వాస్తవమేనని, నగ్నంగా ఊరేగించలేదని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.