యాప్నగరం

రూ.50కోట్ల కోసం యువకుడి కిడ్నాప్

ఢిల్లీ పోలీసులు యువకుడి కిడ్నాప్ కేసును చేధించారు.

TNN 10 Oct 2016, 4:12 pm
న్యూఢిల్లీలో కొన్ని రోజుల క్రితం ఓ యువకుడిని కిడ్నాప్ చేసి అయిదురోజుల తరువాత విడిచిపెట్టేశారు. ఆ కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కిడ్నాపర్లు చెప్పిన వివరాలు విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆ వివరాలని మీడియాకు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అన్ని కిడ్నాప్‌లలో ఈ కిడ్నాపే ఖరీదైనది. ఈ కిడ్నాపర్లు అడిగిన మొత్తం ఇంతవరకు ఎవరూ అడగలేదట. ఏకంగా రూ.50 కోట్లు డిమాండ్ చేశారట. న్యూఢిల్లీలో అత్యంత ధనవంతుడైన ఓ వ్యక్తికి 19 ఏళ్ల కొడుకు రాకీ (పేరు మార్చాం) ఉన్నాడు. ఆ ధనవంతుడు మాజీ కౌన్సిలర్‌ కూడా.
Samayam Telugu delhi police cracked the kidnapping case of a teenager
రూ.50కోట్ల కోసం యువకుడి కిడ్నాప్


రాకీ రోజూ బీఎండబ్ల్యూ కారులో కాలేజీకి వెళ్లి వస్తూ ఉంటాడు. మహేష్, మంజీత్ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్నారు. వారికి మాజీ కౌన్సిలర్ అంటే పడదు. అసూయ పెంచుకున్నారు. అతని కొడుకుని కిడ్నాప్ చేసి కోట్లు సంపాదించాలని ప్లాన్ వేశారు. కిరాయి రౌడీలని పెట్టి కాలేజీకి వెళుతున్న రాకీ కారుని పోలీసు యూనిఫారంలో వెంబడించారు. మధ్యలో కారు ఆపి పోలీస్‌స్టేషన్‌కని చెప్పి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు.

అనంతరం అతని తండ్రికి ఫోన్ చేసి రూ.50కోట్లు డిమాండ్ చేశారు. అయిదు రోజులు చర్చల అనంతరం రూ.కోటి ఇచ్చి కొడుకును విడిపించుకున్నాడు మాజీ కౌన్సిలర్. ఇది జరిగి వారం రోజులు అవుతుంది. పోలీసులు కిడ్నాపర్ల కోసం వల పన్ని పట్టుకున్నారు. అసలు విషయం కక్కించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.