యాప్నగరం

లాకర్లలో బంగారాన్ని కేంద్రం సీజ్ చేయనుందా?!

తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకు లాకర్లలో ప్రజలు దాచుకున్న బంగారం సేఫేనా?!

TNN 4 Dec 2016, 9:38 am
పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వం కన్ను బంగారంపై పడనుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి బలం చేకూర్చుతూ ఇటీవల పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపు పన్ను చట్టాన్ని సవరిస్తూ చేసిన మార్పుల్లో బంగారం నిల్వలను గురించి కూడా కొన్ని సెక్షన్లు చేర్చారు. పరిమితికి మించి బంగారం ఉంటే దానిపై పన్నులుండబోవని, వారసత్వంగా వచ్చే బంగారానికి లెక్క అప్పచెప్పాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేసారు. కానీ, కొన్ని రకాల వర్గాలు పనికట్టుకుని పుకార్లు లేవదీస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో బ్యాంకుల లాకర్లలో దాచుకున్న బంగారంపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేయనున్నారని, అనంతరం ఆ బంగారాన్ని సీజ్ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రజల్లో భయాందోళనలు చోటుచేసుకున్నాయి.
Samayam Telugu demonetization rumours about seizing of gold in bank lockers
లాకర్లలో బంగారాన్ని కేంద్రం సీజ్ చేయనుందా?!


రేపో మాపో వారి లాకర్లు ఇక తెరుచుకోబోవని, వాటిని ప్రభుత్వాధికారుల సమక్షంలోనే తెరుచుకునేలా మార్పులు చేసారని ప్రచారం జోరందుకోవడంతో అంతా బ్యాంకులకు పరుగులు తీసి లాకర్లలోని బంగారాన్ని చెక్ చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. నోట్ల రద్దు తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బ్యాంకుల సిబ్బంది రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. ఇప్పుడు వారికి బంగారం వ్యవహారం మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టింది. బంగారం దాచుకున్న ఖాతాదారులు లాకర్లలోని తమ బంగారాన్ని చూపించాలంటూ బ్యాంకుల ఎదుట క్యూలు గడుతున్నారు. అసలే పని ఒత్తిడిలో ఉన్న సిబ్బంది దానికి ససేమిరా అనడంతో ఖాతాదారుల్లో అనుమానాలు మరింత ముదురుతున్నాయి. నిజంగానే బంగారం లాకర్లు సీజ్ అయ్యాయేమోనని వారు బెంబేలెత్తిపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.