యాప్నగరం

రూ.11తో పెళ్లిచేసేసుకున్నారు..

కోట్లాది రూపాయిలు వృధాగా ఖర్చు పెట్టి వివాహాలు చేసుకునే వారి చెంపలు చెల్లుమనిపించే ఘటన నోయిడాలో జరిగింది.

TNN 14 Dec 2016, 8:26 am
పెళ్లంటే నూరేళ్ల పంట అని అందరికి తెలుసు. గనుల కుంభకోణం నేరస్తుడు గాలి జనార్ధన్ రెడ్డి వందల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి తన కుమార్తె వివాహం జరిపించిన సంగతి జాతీయ స్థాయిలో చర్చగా మారిన సంగతి తెలిసిందే. వారంత కాకపోయినా ఉన్నంతలో కాస్తయినా ఘనంగా చేసుకోవాలని తలచే కుటుంబాలెన్నో. నోట్ల రద్దు నేపధ్యంలో చాలామంది తమ గృహాల్లో వివాహాలు వాయిదాలు వేసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే.
Samayam Telugu demonetized wedding groom receives rs 11 tea for guest
రూ.11తో పెళ్లిచేసేసుకున్నారు..


కానీ, కొందరు ఈ కష్ట కాలంలో కూడా అందరికి భిన్నంగా ఆలోచించి ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రేటర్ నోయిడాకు చెందిన మహావీర్ సింగ్, గ్యానోల ముద్దుబిడ్డ సంజుకు యోగేశ్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. కానీ, ఆ తరువాత నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా కరెన్సీకి పెద్ద ఎత్తున కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వివాహం ఎలా చేయాలో తెలియక ఇరు కుటుంబాల వారు తలలు పట్టుకున్నారు. కానీ వరుడు యోగేశ్ హంగూ ఆడంబారాలకు తావు లేకుండా సింపుల్ గా వివాహం చేసుకుంటానని చెప్పడంతో అంతా సంతోషించారు. వివాహానికి వచ్చిన వారికి టీ ఆతిధ్యం ఇచ్చి వధూవరులతో దండలు మార్పించారు. కట్నం కింద వరుడికి రూ.11 సమర్పించారు. ఆ మొత్తం స్వీకరించిన వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. వీరి వివాహ తంతును అంతా అభినందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.