యాప్నగరం

మహిళ కడుపులో 1.5 కిలోల తల వెంట్రుకలు!

కొంతమందికి తల వెంట్రుకలు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఎంత ప్రమాదకరమో చూడండి.

TNN 22 Nov 2017, 7:55 pm
కొంతమందికి తల వెంట్రుకలు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఎంత ప్రమాదకరమో చూడండి. మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల యువతి రపాంజెల్ సిండ్రోమ్ అనే మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఆమె నిత్యం తన తల వెంట్రుకలను పీక్కొని చప్పరించడం అలవాటు. దీంతో, ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుండటంతో ఆమెను ముంబయిలోని ఈ ఏడాది సెప్టెంబరు నెలలో ముంబయిలోని చత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో ఆసుపత్రిలో చేరింది.
Samayam Telugu doctors remove 1 5kg ball of hair from womans stomach
మహిళ కడుపులో 1.5 కిలోల తల వెంట్రుకలు!


పీటీఐ వార్త సంస్థ కథనం ప్రకారం.. వైద్యులు దాదాపు మూడు గంటల పాటు శ్రమించి ఆమె కడుపులో పేరుకుపోయిన 1.5 కిలోల వెంట్రుకలను తొలగించారు. ఆమె కడుపు నుంచి వెంట్రుకల ముద్దను తొలగించకపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేదని డాక్టర్ ఆర్కే మాథుర్ తెలిపారు. గతంలో ఇదే ఆసుపత్రిలో 15 ఏళ్ల బాలిక కడుపు నుంచి 2.5 కిలోల వెంట్రుకలను తొలగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.