యాప్నగరం

గుంటూరు, విజయవాడ.. గాడిదమాంసానికి గిరాకీ!

చైనా వాళ్లు కుక్కలను, పిల్లలను ఆరగిస్తారు.. అంటే వింతగా చూస్తాం. అయితే మానవుడి టేస్టుకు అంతూ లేదని, మాంసం విషయంలో కొత్త కొత్త రుచులు చూస్తున్నారు

TNN 31 Oct 2017, 8:43 am
చైనా వాళ్లు కుక్కలను, పిల్లలను ఆరగిస్తారు.. అంటే వింతగా చూస్తాం. అయితే మానవుడి టేస్టుకు అంతూ లేదని, మాంసం విషయంలో కొత్త కొత్త రుచులు చూస్తున్నారు, ఈ విషయంలో చైనీయులే వింత కాదు, మన దగ్గర కూడా ఇలాంటి విభిన్నరుచులను ఆరగిస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఉదాహరణకు ఇప్పుడు ఏపీలోని గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో గాడిద మాంసానికి విపరీతమైన గిరాకీ వచ్చింది. చికెన్ కబాబ్, మటన్ కబాబ్ లను ఎలా బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారో.. ఈ నగరాల్లో గాడిద మాంసాన్ని కూడా అదే విధంగా అమ్ముతున్నారు. ఈ విషయంలో పర్యావరణ పరిరక్షకులు, జంతు పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టుకు కూడా వెళ్లారు.
Samayam Telugu donkey meat selling in gunturvijaywada
గుంటూరు, విజయవాడ.. గాడిదమాంసానికి గిరాకీ!


ఈ పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా కబేళాల్లో గాడిడదలను చంపుతున్నారని, వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారని.. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఏపీ, తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గాడిదల వధను నిషేధించాలని.. అనుమతి లేని కబేళాల మూసి వేతకు ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ వాళ్లు కోర్టును కోరారు.

మొన్నటి వరకూ గాడిద పాలకు గిరాకీ వచ్చిన వైనాన్ని అంతా గమనించారు. ఇప్పుడు గాడిదల మాంసం మీద పడ్డారు జనాలు. ఆవురావురంటూ గాడిద మాంసంతో వండిన వంటకాలను ఆరగిస్తున్నారు. ఊహించుకోవడానికే కొంతమందికి ఇదంతా కంపరంగా ఉండవచ్చు. అయితే తినేవాళ్లకు మాత్రం గాడిద మాంసంలో రుచి దొరికిందంతే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.