యాప్నగరం

అమరావతిలో లీటరు గాడిద పాలు రూ.1000

‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అన్న యోగి వేమన పద్యాన్ని బహుశా తిరగరాయాలేమో!

TNN 4 Oct 2017, 1:47 pm
‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అన్న యోగి వేమన పద్యాన్ని బహుశా తిరగరాయాలేమో! ఔషధ విలువలున్నాయన్న నమ్మకంతో కొంత మంది గాడిద పాలు కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో ఇప్పుడు గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో లీటర్ గాడిద పాలను రూ.1000లకు విక్రయిస్తున్నారు.
Samayam Telugu donkey milk sells like hot cakes in amaravathi villages
అమరావతిలో లీటరు గాడిద పాలు రూ.1000


తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన వడ్డీరాజుల కులస్తులు అమరావతి పరిసర గ్రామాల్లో తిరుగుతూ 50 మిల్లీలీటర్ల గాడిద పాలను రూ.50కు అమ్ముతున్నారు. గాడిదలను తమవెంట తీసుకెళ్లి అక్కడే పాలు పితికి ఇస్తున్నారు. సుమారు 40 పాడి గాడిదలను అమరావతి శివారులో ఉంచి ఉదయాన్నే వాటిని తీసుకుని గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

అయితే వీరు గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల పర్యటించి గాడిద పాలను విక్రయించారు. ఇవి తాగితే ఉబ్బసం, ఆయాసం, నడుంనొప్పి, కడుపునొప్పి తదితర రోగాలు నయమవుతాయని వారు చెబుతున్నారు. వాస్తవానికి ఇది కొత్త విషయమేమీ కాదు. దేశంలోని చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రజలు గాడిద పాలను తీసుకుంటున్నారు. ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లోనూ మార్పులు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.