యాప్నగరం

అమ్మకానికి హనీప్రీత్, గుర్మీత్..!

అకృత్యాలకు పాల్పడి జైల్లో ఉన్న గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్, అతడి పాపాల్లో భాగం పంచుకుని అరెస్టైన హనీప్రీత్ సింగ్‌లను అమ్మడం ఏమిటి

TNN 6 Nov 2017, 10:38 am
అదేంటీ.. తండ్రీకూతుళ్లం అని చెప్పుకునే వాళ్లిద్దరూ అమ్మకానికి రావడం ఏమిటి? అకృత్యాలకు పాల్పడి జైల్లో ఉన్న గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్, అతడి పాపాల్లో భాగం పంచుకుని అరెస్టైన హనీప్రీత్ సింగ్‌లను అమ్మడం ఏమిటి? అంటారా.. అయితే ఇక్కడ అమ్మానికి వచ్చింది గుర్మీత్ సింగ్, హనీప్రీత్‌లు వ్యక్తిగతంగా కాదు. వాళ్ల పేర్లతో నామకరణం అయిన రెండు గాడిదలు!
Samayam Telugu donkeys named after gurmeet ram rahim honeypreet sold at rs 11000
అమ్మకానికి హనీప్రీత్, గుర్మీత్..!


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన ఒక గాడిదల సంతలో గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్, హనీప్రీత్ అనే రెండు గాడిదలు అమ్మకానికి వచ్చాయి. రాజస్థాన్ కు చెందిన ఒక వ్యక్తీ రెండింటినీ 11,000 రూపాయలకు అమ్మాడు. డేరా సచ్ఛా సౌధా బాబా గుర్మీత్ పేరును, అతడి ‘దత్తపుత్రిక’ పేరును తన గాడిదలకు పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు ఈ గాడిదల వ్యాపారి.

వాళ్ల పేర్లు పెట్టి తన గాడిదలను మంచి రేటుకు అమ్ముకుందామని కూడా అతడు ప్రయత్నించాడు. అయితే అతడు ఆశించినది జరగలేదట, హనీప్రీత్- గుర్మీత్ లను కనీసం ఇరవై వేల రూపాయలకు అమ్మాలని అతడు అనుకున్నాడు. అయితే అంత రేటు పలకలేదట చివరకు 11వేల రూపాయలకు అమ్మకం జరిగిందని తెలుస్తోంది.

ఈ గాడిదల సంతలో మరిన్ని సెలబ్రిటీ గాడిదలు కూడా అమ్ముడయ్యాయి. జీఎస్టీ, బాహుబలి, సుల్తాన్, జియో తదితర పేర్లను పెట్టి గాడిదలను అమ్మారు వ్యాపారులు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.