యాప్నగరం

మద్యం మత్తు తలకెక్కి బస్ దొంగిలించాడు

మద్యం మత్తు బాగా తలకెక్కడంతో ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఒక వ్యక్తి ఏకంగా కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సునే దొంగిలించేశాడు.

TNN 3 Jun 2016, 6:58 pm
మద్యం మత్తు బాగా తలకెక్కడంతో ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఒక వ్యక్తి ఏకంగా కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సునే దొంగిలించేశాడు. గురువారం రాత్రి ఒక బార్లో పీకలవరకు మద్యం సేవించిన ప్రకాశన్ అనే వ్యక్తి తొడుపుఝా బస్టాండు వైపు వెళ్లాడు. అక్కడ కొన్ని ఖాళీ బస్సులు కనిపించడంతో అతను వాటిలో ఒక బస్సులోకి ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చుని, సర్రున బస్టాండ్ నుండి బయటకు పరుగులు తీయించాడు. అతగాడు బస్సును దొంగిలిస్తున్నా అక్కడున్న సిబ్బంది ఎవరూ గమనించలేదు. ఖాళీ బస్సును మువ్వట్టుపుఝా ప్రాంతం వైపునకు పరుగులు తీయించిన తరువాత అతగాడికి దాహం వేసింది. ఈలోగా ఇటువైపు బస్టాండులోని సిబ్బంది తమ బస్సుల్లో ఒక బస్సు మాయమవడం గమనించి కంగారుపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారితో కలిసి వెతుకులాట మొదలుపెట్టారు.
Samayam Telugu drunkard puts police in soup
మద్యం మత్తు తలకెక్కి బస్ దొంగిలించాడు


దాహం వేసిన ప్రకాశ్ రోడ్డు పక్కన గల ఒక దుకాణం వద్ద బస్సును నిలిపి నీటిని తాగుతుండగా, అటుగా వెళ్తున్న కేరళ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆ బస్సును గమనించాడు. బస్ అంతా ఖాళీగా ఉండటం, దాని డ్రైవర్ సీట్లోని వ్యక్తి తీరు ఏదోరకంగా ఉండటంతో అతనికి అనుమానం వచ్చింది. వెంటనే ఆ బస్సులోకి ఎక్కి తాగుబోతును ప్రశ్నించాడు. తానే ఆ బస్సును నడుపుకుంటూ ఇంత దూరం వచ్చేసానని ప్రకాశ్ బదులిచ్చాడు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని ప్రకాశ్ ను అరెస్ట్ చేసి, బస్సును ఆర్టీసీ సిబ్బందికి అప్పగించారు. పీకల్లోతు వరకు మద్యం మత్తులో ఉన్నప్పటికీ సదరు తాగుబోతు వ్యక్తి ఎటువంటి ప్రమాదం లేకుండా బస్సును నడపడంతో అంతా హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో కూడా అతను ఈ లోకంలో లేడు. కానీ, బస్సును మాత్రం క్షేమంగా నడిపిన తీరు వారిని ఆశ్చర్యపరిచింది.

You can also read this story in Malayalam: http://malayalam.samayam.com/social/drunkard-steals-ksrtc-bus/articleshow/52571138.cms

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.