యాప్నగరం

రూపాయి పతనాన్ని వాడేసుకున్న ‘కండోమ్’!

గత కొద్ది రోజులుగా పతనావస్థలో ఉన్న రూపాయి విలువ దేశ ఆర్థిక వ్యవస్థను ముప్పుతిప్పలు పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్ (ఫారెక్స్‌) మార్కెట్‌ ట్రేడింగ్‌లో డాలర్‌ విలువతో పోల్చితే రూపాయి ప్రస్తుత విలువ రూ.68.45గా ఉంది.

Samayam Telugu 1 Jul 2018, 2:23 pm
త కొద్ది రోజులుగా పతనావస్థలో ఉన్న రూపాయి విలువ దేశ ఆర్థిక వ్యవస్థను ముప్పుతిప్పలు పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్ (ఫారెక్స్‌) మార్కెట్‌ ట్రేడింగ్‌లో డాలర్‌ విలువతో పోల్చితే రూపాయి ప్రస్తుత విలువ రూ.68.45గా ఉంది. కొద్ది రోజుల కిందట దీని విలువ 68.79 నుంచి 69.10కి కూడా పడిపోయింది.
Samayam Telugu asdfa


అయితే, రూపాయి అత్యంత కనిష్టంగా రూ.69.10కి పడిపోవడాన్ని ‘డ్యూరెక్స్ ఇండియా’ కండోమ్ సంస్థ వేరేలా ఉపయోగించుకుంది. వారికి ‘69’లో కొత్త కోణం కనిపించింది. దాన్ని కోణం అనడం కంటే ‘భంగిమ’ అనడం బెటరేమో. ఔను, డ్యూరెక్స్ ఇదే ఆలోచించింది. అలా ఐడియా రాగానే ఇలా ఓ ప్రకటన ఇచ్చేసింది.

సెక్స్‌ పొజిషన్లలో ఎక్కువగా చెప్పుకునే ‘69’ భంగిమను ఉద్దేశిస్తూ.. ఈ ప్రకటన రూపొందించింది. ‘‘రూపాయి ఈ భంగిమలో సరిగా పెర్ఫాం చేయకపోవచ్చు. కానీ, మీరు చేయగలరు’’ అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.