యాప్నగరం

టూరిస్టులకి చుక్కలు చూపించిన ఏనుగు

అడవులకి వెళ్లిన వారిని ఏనుగులు వెంబడించడం, కొంత దూరం వరకు తరిమి కొట్టడం వంటి సన్నివేశాలని రియల్‌గా చూస్తే...

TNN 28 May 2017, 9:31 am
అడవులకి వెళ్లిన వారిని ఏనుగులు వెంబడించడం, కొంత దూరం వరకు తరిమి కొట్టడం వంటి సన్నివేశాలని అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తూ వుంటాం. కానీ నిజంగానే అటువంటి ఘటనలు ఎదురైతే ఆ రియల్ సీన్‌లో వున్న వారి పరిస్థితి ఏంటి ? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ వెనక్కి తిరిగిచూడకుండా పారిపోవాల్సిందే. సరిగ్గా అటువంటి ఘటనే ఎదురైంది ఉత్తరాఖండ్‌లోని రాంనగర్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌కి వెళ్లిన ఈ టూరిస్టులకి.
Samayam Telugu elephant chases a tourists jeep in jim corbett national park of uttarakhand
టూరిస్టులకి చుక్కలు చూపించిన ఏనుగు


ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఏనుగుతో ఏం పరాచికాలాడారో ఏమో తెలీదు కానీ... అది ఆగ్రహంతో వారిని కొంతదూరం వరకు వెంబడించింది. ఏనుగు చేతికి చిక్కితే ఏమై పోయే వారో కానీ పోనివ్వు.. పోనివ్వు.. అంటూ జీపుని ముందుకు పోనిచ్చి బతికిపోయారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో ఏ టూరిస్టులకైతే ఈ చేదు అనుభవం ఎదురైందో... వారి కెమెరాకే చిక్కిన ఈ ఏనుగు చేజింగ్ సీన్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.