యాప్నగరం

మా అక్క బరువు తగ్గలేదు... అంతా మోసం

ఎమాన్ బరువు తగ్గిందని వైద్యుడు చెప్పడం అంతా అబద్ధమని అంటోంది సైమా.

TNN 25 Apr 2017, 11:02 am
ఎమాన్ మహ్మద్... ప్రపంచంలోనే అతి బరువైన మహిళ. ఆమెను బరువు తగ్గించి ఆరోగ్యవంతురాలిని చేసే బాధ్యతలను ముంబై ఆసుపత్రి తీసుకుంది. ముంబై సైఫీ ఆసుపత్రిలోని డాక్టర్ ముఫజల్ లక్డావాలా ఆమెకు ఉచితంగా చికిత్స చేయడానికి ముందుకు వచ్చారు. రెండు నెలలుగా ఆమె ముంబైలోనే చికిత్స పొందుతోంది. కొన్ని రోజుల క్రితం డాక్టర్ లక్డావాలా ఎమాన్ ఊహించని రీతిలో బరువు తగ్గారని ప్రకటించారు. ఆమె ఆసుపత్రికి వచ్చినప్పుడు అయిదు వందల కిలోలు ఉన్నారని సర్జరీ తరువాత 250 కిలోల వరకు బరువు తగ్గారని చెప్పారు. అయితే తాజాగా ఎమాన్ సోదరి సైమా అదంతా అబద్ధమని చెబుతోంది. డాక్టర్ లక్డావాలా తమను మోసం చేశారని ఆరోపిస్తోంది. తన అక్క ఎమాన్ ఏ మాత్రం కోలుకోలేదని తెలిపింది. వైద్యుడు లక్డావాలా అబద్ధాలు చెబుతున్నారని చెప్పింది.
Samayam Telugu eman ahmeds weight loss was a lie says emans sister shaimaa
మా అక్క బరువు తగ్గలేదు... అంతా మోసం


డాక్టర్ లక్డావాలా సైమా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఎమాన్ అహ్మద్ బరువు తగ్గారని, ఆరోగ్యం కూడా మెరుగు పడిందని చెప్పారు. ముందటి పరిస్థితితో పోలిస్తే ఆమె గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు... ఇలా ముఖ్యభాగాలన్నీ బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఆమె నరాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు సీటీస్కాన్ చేస్తామని చెప్పారు. సైమా కొన్ని రోజులు బాగానే ఉందని, ఎమాన్ కోలుకుందని చెప్పి... ఈజిప్టు తీసుకెళ్లమని చెప్పడంతో ఆమె ఈ విధంగా మాట్లాడుతోందన్నారు. తిరిగి ఈజిప్టు తీసుకెళ్లేందుకు ఆర్థిక సమస్యలు అడ్డుగా ఉండడం వల్లే సైమా తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.