యాప్నగరం

పవన్ పేరును పచ్చబొట్టేసుకున్న నిహారిక

'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ ను ఆయన అభిమానులు ఓ నటుడిగానే...

TNN 27 Jun 2016, 5:59 pm
'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనని అభిమానులు ఓ దేవునిగా కొలుస్తారు. ఎందుకంటే పవన్ ను ఆయన అభిమానులు కేవలం ఓ నటుడిగానే కాక ఓ మానవతావాదిగా, ఓ నాయకునిగా చూస్తారు. పవన్ కళ్యాణ్ ఎంతో మంది అభిమానులకు సహాయం చేస్తూ అవేవి బయటకు చెప్పకుండా చాలా ఉదారంగా, హుందాగా వ్యవహరిస్తారు. కోట్లాది మంది అభిమానులే కాదు, సినీ స్టార్లు సైతం ఆయనను స్పూర్థిగా తీసుకుంటారు. తాజాగా మండలి నిహారిక అనే అభిమాని కూడా పవన్ కళ్యాణ్ పేరును తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకుంది. పవన్ కళ్యాణ్ తన ధైర్యం, తనకు స్పూర్థి అని నిహారిక చెప్తుంది. మరి పవన్ పై ఇంతటి అభిమానం చూపించటం వెనక నిహారిక జీవితంలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. నిహారిక 20 ఏళ్లపుడు ఆమె తల్లిదండ్రులు ఆమెకు బలవంతపు పెళ్లి చేశారు. పెళ్లైన తర్వాత భర్త పెట్టిన చిత్రహింసలు భరించలేక ఆమె తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అయితే అదృష్టవషాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. కానీ ఒళ్లంత కాలిన గాయాలతో జీవనం సాగిస్తూ తనలాంటి వారికి జీవితంపై నమ్మకాన్ని కలిగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. తనకు ఇంతటి ధైర్యం, ఆదరణ లభించడానికి పవన్ కళ్యాణే కారణం.. ఆయనే నా జీవితానికి స్పూర్థి అని నిహారిక అంటోంది.
Samayam Telugu fan tattooed pawan kalyan name
పవన్ పేరును పచ్చబొట్టేసుకున్న నిహారిక


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.