యాప్నగరం

కింద పులి, పైనుంచి వర్షం.. రాత్రంతా చెట్టు మీదే

చేపల వేటకు వెళ్లిన వారి పడవ బోల్తా పడటంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. తీరా చూస్తే అది పులులుండే ప్రాంతం. అప్పుడు వారి పరిస్థితి ఏంటి?

TNN 11 Aug 2016, 2:08 pm
పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతం బెంగాల్ టైగర్లకు కేరాఫ్ అడ్రస్. అలాంటి భయంకరమైన పులులు సంచరించే ప్రాంతంలో రాత్రి పూటంతా అందులోనూ భారీ వర్షంలా ఉండాల్సి వస్తే? అది నిజంగా నరకమే కదూ..! బెంగాల్లోని తండ్రీకొడుకులకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ధోరాబగ్డా అనే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మొహ్రం బైదా, అల్లాద్దీన్ బైదాలు కలిసి మంగళవారం ఉదయాన్నే సమీపంలోని మాట్లా నదిలో చేపల వేటకు వెళ్లారు. పగలంతా చేపలు పట్టిన వారు రాత్రి పూట ఇంటికి బయల్దేరారు. కానీ భారీ వర్షం కారణంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహ వేగం ధాటికి వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. నదిలో పడవ కొట్టుకుపోగా వారు మత్రం ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. అమ్మా.. బతికిపోయాం రా బాబు అనుకునేలోగా వారికి పులి గాండ్రింపు వినిపించింది. దీంతో వారు పరుగుపరుగున వెళ్లి దగ్గర్లో ఉన్న ఓ పెద్ద చెట్టెక్కి కూర్చున్నారు. పై నుంచేమో కుండపోతలా వర్షం, కింద పులుల అరుపులు. ఈ భయంకర పరిస్థితిలో ఆ రాత్రంతా వారు బిక్కు బిక్కుమంటూ నిద్రలేకుండా గడిపారు. తెల్లవారాక వారిని వెతుక్కుంటూ వచ్చిన తోటి మత్స్యకారులు అక్కడికి చేరుకోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. వారి సాయంతో ఆ తండ్రీ కొడుకులు బతుకు జీవుడా అంటూ ఇల్లు చేరారు.
Samayam Telugu father and son took sheltar on a tree to feer for tiger at sundarban
కింద పులి, పైనుంచి వర్షం.. రాత్రంతా చెట్టు మీదే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.