యాప్నగరం

ప్రధానికి లేఖ రాసి యువరైతు ఆత్మహత్య

ఆత్మహత్యకు పాల్పడే ముందు ప్రధానికి లేఖ రాసిన ఈ యువరైతు.. రైతుల ఆవేదనను కళ్లకు కట్టాడు..

TNN 2 Aug 2016, 4:37 pm
మహారాష్ట్రకు చెందిన గోపాల బాబారావు రాథోడ్‌(22)కు వారసత్వంగా వచ్చిన మూడెకరాల పొలం ఉంది. కానీ బ్యాంకు రుణాల బాధ తాళలేక అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణించే ముందు అతడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. డబ్బున్న వాళ్లు క్రికెట్, వాలీబాల్ ఆడుతున్నారు.. మరి నలుగురికీ అన్నం పెట్టే రైతుల పిల్లలు ఏం చేస్తున్నారు? అని ఆ లేఖలో ప్రశ్నించాడు. ప్రొఫెసర్లే తమ పిల్లల ఇంజనీరింగ్ ఫీజును భరించలేకపోతున్నారు. మరి రైతుబిడ్డలు ఏం చేయాలి అని కూడా ఆ లేఖలో ఆవేదనను వ్యక్తం చేశాడు. ఉద్యోగులకు కరవు భత్యం ఇస్తున్న ప్రభుత్వాలు రైతులకు మాత్రం మద్దతు ధర ఇవ్వడంలో విఫలం అవుతున్నాయన్నాడు. ఎలాంటి విచారణ లేకుండా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని, ఆటోడ్రైవర్లు పోలీసులకు లంచం ఇవ్వాల్సి రావడాన్ని ఆయన ప్రశ్నించాడు. గతంలో బాబారావు తండ్రి విశాల్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఆయన కూడా చనిపోయే ముందు సంజయ్ రాథోడ్ అనే మంత్రికి లేఖ రాశాడు.
Samayam Telugu father writes letter to prime minister before committed suicide
ప్రధానికి లేఖ రాసి యువరైతు ఆత్మహత్య


ప్రధానికి రాసిన లేఖ..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.