యాప్నగరం

సీఎంను తిట్టినా.. ఫేస్‌బుక్ సహకరించట్లేదు!

సాక్ష్యాత్తూ రాష్ట్రముఖ్యమంత్రిని తిడుతూ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి ఐపీ అడ్రస్ ఇవ్వాలని కోరినా.. ఫేస్‌బుక్ మాత్రం నో చెబుతోంది.

TNN 10 Jan 2018, 11:43 am
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను దూషిస్తూ ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెట్టిన వ్యక్తికి సంబంధించిన ఐపీ అడ్రస్ ఇచ్చేందుకు ఫేస్‌బుక్ సంస్థ నిరాకరించింది. దీంతో హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ అధికారులు సమచారం కోసం ఇంటర్‌పోల్‌కు లేఖ రాశారు. సీఎంను దూషిస్తూ.. రామకృష్ణ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో నవంబర్ 13న చాదర్‌ఘట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తర్వాత అతడి ఫేస్‌బుక్ ఐడీకి సంబంధించి తాజాగా సైబర్ క్రైమ్ విభాగం మరో కేసు రిజిస్టర్ చేసింది.
Samayam Telugu fb will not reveal ip addresses over abusive posts against k chandrasekhar rao
సీఎంను తిట్టినా.. ఫేస్‌బుక్ సహకరించట్లేదు!


విదేశాల నుంచి ఫేస్‌బుక్ ద్వారా దూషణకు దిగిన వ్యక్తుల ఐపీ అడ్రస్ ఇవ్వడానికి సదరు సోషల్ మీడియా సంస్థ నిరాకరిస్తోంది. నిందితుడి లాగిన్, లాగౌట్ ఐపీ వివరాల్ని ఫేస్‌బుక్ ఇవ్వకపోతే వారిని గుర్తించడం కష్టంగా మారుతోంది. ఫేస్‌బుక్ సహాయ నిరాకరణతో ఇలాంటి 17 కేసులను సైబర్ క్రైమ్ పోలీసులు మూసేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వ్యక్తిగత దూషణతోపాటు మతపరమైన సున్నితమైన అంశాలపై మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు చేస్తున్న వారి ఐపీ అడ్రస్‌లను ఫేస్‌బుక్ పోలీసులతో పంచుకోవడం లేదు.

ఫేస్‌బుక్ ఐపీ అడ్రస్ ఇవ్వకపోయినప్పటికీ.. ట్రాకర్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఈమెయిల్స్, మెసేజ్‌లను ఉపయోగించి నిందితుల్ని గుర్తించొచ్చు. కానీ వీటిని న్యాయస్థానం సాక్ష్యంగా గుర్తించకపోవడం సమస్యగా మారింది. దీంతో కేసు ముందుకు వెళ్లాంటే ఫేస్‌బుక్ ఇచ్చే అధికారిక నివేదిక కీలకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. లైంగిక వేధింపులు, మహిళలను వేధింపులకు గురి చేస్తోన్న కేసుల్లో మాత్రం ఫేస్‌బుక్ నిందితుల ఐపీ అడ్రస్‌లను పోలీసులకు ఇస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.