యాప్నగరం

బిడ్డను ప్రసవించబోతున్న పురుషుడు!!

భస్మాసురుణ్ని సంహరించడానికి శ్రీహరి మోహినీ అవతారం దాల్చినప్పుడు హరిహరాదులకు పుట్టిన బిడ్డే అయ్యప్పగా పూజలందుకుంటున్నాడు. ఈ విషయాలు హిందూ పురాణాల్లో చదువుకున్నాం.

TNN 9 Jan 2017, 11:08 am
భస్మాసురుణ్ని సంహరించడానికి శ్రీహరి మోహినీ అవతారం దాల్చినప్పుడు హరిహరాదులకు పుట్టిన బిడ్డే అయ్యప్పగా పూజలందుకుంటున్నాడు. ఈ విషయాలు హిందూ పురాణాల్లో చదువుకున్నాం. ఇవి కేవలం హిందువులకే మాత్రం తెలిసి విషయం. అయితే సృష్టి ధర్మం గతి తప్పబోతుంది, ప్రపంచంలో తొలిసారిగా ఓ పురుషుడు బిడ్డను ప్రసవించబోతున్నాడు. లింగ మార్పిడితో పురుషుడిగా మారనున్న బ్రిటన్‌కు చెందిన హేడెన్‌ క్రాస్‌ ప్రస్తుతం 16 వారాల గర్భంతో ఉన్నాడు.
Samayam Telugu first british man to reveal hes pregnant says he tracked down sperm donor via facebook
బిడ్డను ప్రసవించబోతున్న పురుషుడు!!


ప్రసవంతోనే బిడ్డకు జన్మనివ్వనున్న తొలి మగాడిగానూ రికార్డు సృష్టించబోతున్నాడు. పుట్టుక రీత్యా స్త్రీ అయిన హేడెన్‌ మూడేళ్ల కిందటి నుంచి చట్టబద్ధంగా మగాడిలానే జీవిస్తున్నాడు. పురుషుడిగా మారేందుకు హార్మోన్ల చికిత్స చేయించుకుంటున్నాడు. భవిష్యత్తులో సంతానం కోసం తన అండాలను భద్రపరచాలన్న ఆయన కోరికను బ్రిటన్ ప్రభుత్వం తిరస్కరించింది.

దీనికి 4 వేల పౌండ్లు ఖర్చవుతాయనే కారణంతో అతడి ప్రతిపాదనను బ్రిటన్ ఆరోగ్య సంస్థ తోసిపుచ్చింది. దీంతో అతడు ఫేస్‌బుక్‌ ద్వారా ఒక వీర్యదాతను కనుగొని గర్భం దాల్చాడు. లింగమార్పిడి పూర్తయ్యాక గర్భం సాధ్యం కాదు కాబట్టి అంతకుముందే బిడ్డను కనాలనుకున్నానని, తాను మంచి నాన్నను అవుతానని హేడెన్‌ చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.