యాప్నగరం

దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ స్కూల్

దేశంలోనే మొదటిసారిగా ట్రాన్స్ జెండర్ల (లింగమార్పడి చేయించుకునే వ్యక్తులు)కు కేరళలో పాఠశాల ప్రారంభమైంది.

TNN 4 Jan 2017, 12:47 pm
దేశంలోనే మొదటిసారిగా ట్రాన్స్ జెండర్ల (లింగమార్పడి చేయించుకునే వ్యక్తులు)కు కేరళలో పాఠశాల ప్రారంభమైంది. సహజ్ ఇంటర్నెషన్ లో పేరుతో ప్రారంభమైన ఈ స్కూలును నడపనుంది కూడా ఓ ట్రాన్స్ జెండర్ కావడం విశేషం. ఎర్నాకుళం జిల్లాలోని త్రిక్కకరలోని ఇది ప్రారంభమైంది. ట్రాన్స్ జెండర్, యాక్టివిస్, యాక్టర్ కల్కి సుబ్రమణ్యం (విజయరాజా మల్లిక) ఈ పాఠశాలను స్థాపించారు.
Samayam Telugu first transgender school in kerala sahaj international
దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ స్కూల్


ఒపెన్ స్కూలింగ్ పద్ధతిలో ఇక్కడ క్లాసులు చెబుతారు. సమాజంలో వివక్షకు గురవుతూ చదువులు మధ్యలో వదిలేసిన వారు ఇక్కడ చదువుకోవచ్చు. తొలి యేడాది 20-25 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించనున్పారు. విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. పది సీట్లు స్త్రీ నుంచి పురుషులుగా మారిన వారికి కేటాయించారు. ట్రాన్స్ జెండర్ లలో దివ్యాంగులకు రిజర్వేషన్లు సైతం అమలు చేస్తున్నామని కల్కి చెప్పారు.

మొదటి బ్యాచ్ స్టూడెంట్స్ ను కేరళ నుంచి మాత్రమే తీసుకుంటారు.

దాతలు, ప్రభుత్వాలు ముందుకు వస్తే దేశ వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు కూడా చదువుకునే అవకాశం కల్పిస్తామని నిర్వహకులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.