యాప్నగరం

సినిమాల్లో ఆఫర్ ఇప్పిస్తామని 17 రోజుల పాటు అత్యాచారం!

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి 17 రోజుల పాటు ఓ మైనర్ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు.

TNN 29 Dec 2016, 7:18 pm
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి 17 రోజుల పాటు ఓ మైనర్ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అసిస్టెంట్‌ డైరెక్టర్లతో పాటు మరో ఇద్దరిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల్లో డ్యాన్సర్‌గా స్థిరపడాలనే కోరికతో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2 ఇందిరానగర్‌లో నివాసముండే తన మేనమామ ఇంటికి బాధితురాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె బలహీనతను ఆవకాశంగా తీసుకున్న నలుగురు యువకులు 15 ఏళ్ల బాలికపై కన్నేశారు.
Samayam Telugu five mens rapes minor girl as long as 17 days in hyderabad
సినిమాల్లో ఆఫర్ ఇప్పిస్తామని 17 రోజుల పాటు అత్యాచారం!


ఇందిరానగర్‌లో ఉండే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 21 ఏళ్ల షేక్‌ అక్బర్‌), 22 ఏళ్ల తూము వెంకారెడ్డి, ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న నండూరి పాపారావు అలియాస్‌ 31 ఏళ్ల గణేష్‌ మోయినాబాద్‌‌కు చెందిన 19 ఏళ్ల గుడుపల్లి నవీన్‌కుమార్‌లు ఆ బాలికను ట్రాప్ చేశారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని మభ్యపెట్టి ఈ నెల 3న రంగారెడ్డి జిల్లాలోని నందిగామ తీసుకెళ్లారు.

అక్కడ మరో స్నేహితుడు కుమార్‌తో కలిసి ఆమెను ఇందిరానగర్‌, చింతల్, జీడిమెట్లతోపాటు నందిగామ ప్రాంతాలకు తీసుకెళ్లి 17 రోజుల పాటు అత్యాచారం చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోన్‌ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కుమార్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 376 డి, సెక్షన్‌ 5జి, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.