యాప్నగరం

ఫ్రీగా బ్రెస్ట్ ఇన్‌‌ప్లాన్‌టేషన్ సర్జరీలు

సంపన్నయువతులతో పాటు పేద యువతులకు కూడా ఈ అవకాశం ఎందుకు లభించకూడదు అన్న ఉద్దేశ్యంతో ఈ సదుపాయాన్నికల్పించినట్లు తమిళనాడు వైద్యఆరోగ్యశాఖమంత్రి సి.విజయ్‌భాస్కర్ ప్రకటించారు.

TNN 22 Feb 2018, 3:23 pm
మారుతున్న కాలానికి అనుగుణంగా ఎట్టకేలకు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా మారాయి. గత కొన్నేళ్లుగా యువతుల్లో రొమ్ముల అమరికపై ఆసక్తిపెరగడంతో వీరంతా ప్రయివేట్ ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. లక్షలు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ప్రజలకు మిగతా వైద్య సేవలతో పాటు ఈ సర్జరీలు కూడా అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని భావించిన తమిళనాడు వైద్యఆరోగ్యశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇకపై ఉచితంగా బ్రెస్ట్ ఇన్‌‌ప్లాన్‌టేషన్ సర్జరీలు చేస్తామని ప్రకటించింది.
Samayam Telugu free cosmetic breast surgery at govt hospital
ఫ్రీగా బ్రెస్ట్ ఇన్‌‌ప్లాన్‌టేషన్ సర్జరీలు


చెన్నైలోని 'స్టాన్లీ మెడికల్ కాలేజీ'లో ఇకపై ఈ ఆపరేషన్లు జరగనున్నట్లు ప్రకటించింది. సంపన్నయువతులతో పాటు పేద యువతులకు కూడా ఈ అవకాశం ఎందుకు లభించకూడదు అన్న ఉద్దేశ్యంతో ఈ సదుపాయాన్నికల్పించినట్లు తమిళనాడు వైద్యఆరోగ్యశాఖమంత్రి సి.విజయ్‌భాస్కర్ ప్రకటించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్న మహిళలకు సర్జరీలు చేసినట్లుగానే అందంగా కనిపించాలని ఉవ్వీళ్లు ఊరే యువతులకు కూడా సర్జరీలు చేస్తున్నట్లు చెప్పారు. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో రొమ్ముల సైజు పెంచుకోవడంతో పాటు తగ్గించుకునే వెసులుబాటు ఉందని చెప్పారు.

తమది ప్రజాకర్షక నిర్ణయం కాదని వైద్యఆరోగ్యశాఖ మంత్రి అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని చెప్పారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రజాధనాన్ని బ్యూటీ కేర్ కోసం కాకుండా లైఫ్ సేవింగ్ ఆపరేషన్ల కోసం వెచ్చిస్తే బాగుంటుందని సూచించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.