యాప్నగరం

పైపులైనుకి రంధ్రం.. 15 వేల లీటర్ల డీజిల్ చోరీ

పెట్రోలియం కంపెనీకి చెందిన అండర్ గ్రౌండ్‌ పైప్‌లైన్‌కు రంధ్రం చేసిన ముగ్గురు సభ్యుల ముఠా ఏకంగా 15 వేల లీటర్ల డిజీల్‌ను దొంగిలించింది.

TNN 13 Dec 2016, 11:35 am
పెట్రోలియం కంపెనీకి చెందిన అండర్ గ్రౌండ్‌ పైప్‌లైన్‌కు రంధ్రం చేసిన ముగ్గురు సభ్యుల ముఠా ఏకంగా 15 వేల లీటర్ల డిజీల్‌ను దొంగిలించింది. మహ్మద్, ప్రదీప్ రాజ్‌భార్, బాబు షేక్ అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి చమురును దొంగిలించారు. ముంబైలోని మంఖ్రుద్ ప్రాంతంలో ఉన్న హెచ్‌పీసీఎల్ పైపులైన్‌కు కన్నం వేసిన వారు రెండు వారాల్లో 15 వేల లీటర్ల డీజిల్‌ను దొంగిలించారు. పైప్‌లైన్‌లో డీజిల్ ప్రవాహ వేగం తగ్గిందని అధికారులు గుర్తించారు. దీంతో వారు అన్ని పైప్‌లైన్లను తనిఖీ చేశారు. ట్రాంబే, వాషి మధ్య సమస్య ఉన్నట్లు గుర్తించారు. నీటిని సరఫరా చేసే ఓ వ్యక్తి తన బోరులో నుంచి చమురు తెట్టు బయటకొచ్చిందని అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అధికారులు ఆ నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించగా, అందులో డీజిల్ ఉందని తేలింది.
Samayam Telugu gang drills pipe into oil firm line steals 15000 litres diesel
పైపులైనుకి రంధ్రం.. 15 వేల లీటర్ల డీజిల్ చోరీ


ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో దర్యాప్తు ప్రారంభించిన కంపెనీ అధికారులకు తాళం వేసి ఉన్న ఓ పాడుబడిన గుడిసె మీద అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. తాళం పగులగొట్టి అందులోకి వెళ్లారు. ఆ గుడిసెలో ఓ బావిని తవ్వి హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్‌ వాల్వ్‌కు డ్రిల్లింగ్ చేసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. దీంతో నిందితులను అరెస్ట్ విచారించగా నిజం బయటకు వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.