యాప్నగరం

అయ్యా సీఎం గారు.. దయతో నన్ను చంపించండి!

నాపై దారుణానికి ఒడిగట్టిన వాళ్లు నా కళ్ల ముందే తిరుగుతుంటే ఒక్కో క్షణం నరకం అనుభవిస్తున్నా..

TNN 10 Jul 2017, 7:38 pm
'నేనొక దళిత అమ్మాయిని. నాపై మే 2న గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసినా.. ఈ రోజు వరకూ వాళ్లపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. నాపై దారుణానికి ఒడిగట్టిన వాళ్లు నా కళ్ల ముందే తిరుగుతుంటే ఒక్కో క్షణం నరకం అనుభవిస్తున్నా. దయచేసి నాకు న్యాయం చేయండి లేదా మెర్సీ కిల్లింగ్ (కారుణ్య మరణం)కు అనుమతివ్వండి'.. ఓ రేప్ బాధితురాలు సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి పెట్టుకున్న గోడు సారాంశం ఇది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి ఓ అత్యాచార బాధితరాలు చేసిన ట్వీట్‌ ఆ రాష్ట్రంలో సంచనలంగా మారింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Samayam Telugu gang raped dalit girl tweets to cm yogi seeking euthanasia
అయ్యా సీఎం గారు.. దయతో నన్ను చంపించండి!


యూపీ సీఎంకు రేప్‌ బాధితురాలు చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగ్రాకు చెందిన ఆ యువతి ట్వీట్‌తో పాటు.. పోలీసులకు, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్‌కు చేసిన ఫిర్యాదు పత్రాలను కూడా జత చేసింది. సీఎంకు పంపిన ట్వీట్‌లో ఆ రాష్ట్ర డీజీపీ సుల్ఖాన్ సింగ్‌, ఆగ్రా పోలీసులను ట్యాగ్ చేసింది.

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఆ రాష్ట్రంలో అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా ట్వీట్ చేసిన యువతి మనోవేదన పలువురిని కలచివేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.