యాప్నగరం

రష్మీతో సుడిగాలి సుధీర్ రిలేషన్ ఏంటంటే?

సినీ నటి, జబర్దస్త్ షో యాంకర్ రష్మీ గౌతమ్‌, సుడిగాలి సుధీర్ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి గెటప్ శీను క్లారిటీ ఇచ్చాడు..

TNN 20 Aug 2016, 1:07 pm
జబర్దస్త్ ప్రొగ్రాం యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లిద్దరూ లవ్‌లో ఉన్నారని, కొద్ది రోజుల్లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ఇద్దరూ చనువుగా ఉండటంతో ఆ పుకార్లు నిజమేనని అంతా భావించారు. అయితే వారి మధ్య ఎలాంటి అనుబంధం లేదంటా. గెటప్ శీనుతో కలిసి ఫేస్‌బుక్ లైవ్‌‌లోకి వచ్చిన సుడిగాలి సుధీర్ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రష్మి-సుధీర్ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, వారు బయట మాట్లాడుకోవడం చాలా తక్కువని గెటప్ శీను క్లారిటీ ఇచ్చాడు. మా మధ్య క్రష్ లాంటిదేమీ లేదని సుధీర్ కూడా చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా అభిమానులు స్పందిస్తూ.. సుధీర్‌కు పెళ్లి చేయమని శీనుకు సూచించారు. చిరంజీవి 150వ సినిమాలో తాను నటిస్తున్నట్లు శీను చెప్పాడు. పవర్ స్టార్ సినిమాలో సుధీర్ నటించగా ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలోనే శీను నటిస్తున్నాడట.
Samayam Telugu getup seenu clarifies the relationship between sudhir and rashmi
రష్మీతో సుడిగాలి సుధీర్ రిలేషన్ ఏంటంటే?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.