యాప్నగరం

7.8 మీటర్ల పొడవైన కొండచిలువను కోసి కూరొండుకొన్నారు!

కొండచిలువను చూస్తేనే దూరంగా పారిపోతారు. అందులోనూ అది కాస్త పెద్దదైతే ఆ చుట్టుపక్కలకి వెళ్లే ధైర్యం కూడా ఎవరు చేయరు.

TNN 5 Oct 2017, 7:17 pm
కొండచిలువను చూస్తేనే దూరంగా పారిపోతారు. అందులోనూ అది కాస్త పెద్దదైతే ఆ చుట్టుపక్కలకి వెళ్లే ధైర్యం కూడా ఎవరు చేయరు. ఎందుకంటే అది ఎక్కడ మనల్ని చుట్టేసి హామ్‌ఫట్‌మనిపిస్తుందోననే భయం! కానీ అటువంటి భారీ కొండచిలువను ఏకంగా చంపి, కోసి, కూరొండుకుని తినేశారు ఇండోనేషియాలోని పెకన్‌బారు గ్రామస్తులు. సుమత్రా దీవుల్లోని బతంగ్ గన్సల్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా వున్నాయి.
Samayam Telugu giant python fried for feast after fight with villagers in indonesia
7.8 మీటర్ల పొడవైన కొండచిలువను కోసి కూరొండుకొన్నారు!


7.8 మీటర్ల పొడవైన కొండ చిలువ పామ్ ఆయిల్ చేనులోకి రావడం గమనించిన రాబర్ట్ నబనన్ అనే సెక్యురిటీ ఒంటరిగానే దానిపై యుద్ధానికి దిగాడు. అంత పెద్ద కొండ చిలువను ఓ గోనె సంచిలో బంధించే ప్రయత్నం చేశాడు. మరి అంత భారీ కొండ చిలువ అతడిని ఏమీ అనకుండా ఊరుకుంటుందా ? ఊరుకోదు కదా... తిరిగి అతడిపై యుద్ధం ప్రకటించిందా కొండచిలువ. సెక్యురిటీ గార్డు ఎడమ చేయిపై కాటేసి ఆ చేయిని అతడి శరీరం నుంచి వేరు చేసే ప్రయత్నం చేసిందది.

సెక్యురిటీ గార్డు అరుపులకి అక్కడికి చేరుకున్న మరో గార్డ్, ఇంకొందరు గ్రామస్తులు అంతా ఏకమై కొండచిలువని కొట్టిచంపారు. అలా రాబర్ట్ నబనన్‌ని కొండచిలువ బారి నుంచి కాపాడి అతడిని ఆస్పత్రికి తరలించిన అనంతరం ఇదిగో ఇలా రెండు చెట్ల మధ్య కొండచిలువని వేళ్లాడదీసి కోసి కూరొండుకుని పండగ చేసుకున్నారు. సాధారణంగానే పాములని, కొండచిలువలని ఆహారంగా వండుకోవడం ఇండోనేషియన్స్‌కి అలవాటు. అందులోనూ తమపై దాడికి పాల్పడే పాములు, కొండచిలువలు కంటపడితే అస్సలే ఊరుకోరు. అందుకే ఈ కొండచిలువని చంపాకా దానినే కూరొండుకుని పండగ చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.